డిజిలాకర్‌ ద్వారా సులభంగా కేవైసీ

ఖాతాదారుల నిధులకు భద్రత కల్పించడంతో పాటు బ్యాంకుల పాలన మరింత మెరుగు పరచేందుకు బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Published : 02 Feb 2023 03:15 IST

ఖాతాదారుల నిధులకు భద్రత కల్పించడంతో పాటు బ్యాంకుల పాలన మరింత మెరుగు పరచేందుకు బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అందరికీ ఆర్థిక సేవలు కల్పించడంలో సాంకేతికతను ఆర్థిక సంస్థలు వినియోగించుకుంటున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఫిన్‌టెక్‌ సేవలు కూడా ఆధార్‌, పీఎం జన్‌ధన్‌ యోజన, వీడియో కేవైసీ, ఇండియా స్టాక్‌, యూపీఐ ద్వారా అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. డిజిలాకర్‌ ద్వారా మరిన్ని ధ్రువీకరణ పత్రాలు సత్వరం అందుబాటులో ఉండేలా, ఆ సదుపాయాన్ని విస్తరిస్తామని తెలిపారు. డిజిలాకర్‌ సేవల ద్వారా గుర్తింపు, చిరునామాలను అప్‌డేట్‌ చేసేందుకు ‘వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌’ను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు