రూ.164 కోట్లు చెల్లించనున్న మైక్రోసాఫ్ట్‌!

మైక్రోసాఫ్ట్‌ తన ఎక్స్‌బాక్స్‌ వీడియో గేమ్‌ కన్సోల్‌ను ఉపయోగించడానికి సైన్‌ అప్‌ చేసిన చిన్నారుల డేటాను చట్ట విరుద్ధంగా సేకరించి, తమ వద్ద ఉంచుకుందన్న ఆరోపణలను పరిష్కరించుకునేందుకు 20 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.164 కోట్ల) జరిమానాను ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (ఎఫ్‌టీసీ)కు చెల్లించనుంది.

Published : 07 Jun 2023 03:04 IST

చిన్నారుల డేటా చట్ట విరుద్ధంగా సేకరించిందనే ఆరోపణ

శాన్‌ఫ్రాన్సిస్కో: మైక్రోసాఫ్ట్‌ తన ఎక్స్‌బాక్స్‌ వీడియో గేమ్‌ కన్సోల్‌ను ఉపయోగించడానికి సైన్‌ అప్‌ చేసిన చిన్నారుల డేటాను చట్ట విరుద్ధంగా సేకరించి, తమ వద్ద ఉంచుకుందన్న ఆరోపణలను పరిష్కరించుకునేందుకు 20 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.164 కోట్ల) జరిమానాను ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (ఎఫ్‌టీసీ)కు చెల్లించనుంది. తల్లిదండ్రులకు తెలియజేయకుండా లేదా వారి సమ్మతి  పొందకుండా చిన్నారుల డేటాను  మైక్రోసాఫ్ట్‌ సేకరించి తమ వద్ద ఉంచుకుందని ఎఫ్‌టీసీ ఆరోపించింది. ఈ చర్యలు చిల్డ్రన్స్‌ ఆన్‌లైన్‌ ప్రైవసీ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను ఉల్లంఘించడమేనని తెలిపింది. వయసు ధ్రువీకరణ వ్యవస్థలను మెరుగుపర్చడంతో పాటు, చిన్నారులకు సేవలు అందించేందుకు ఖాతాల సృష్టిలో వారి తల్లిదండ్రుల్ని భాగస్వామ్యం చేసేందుకు కంపెనీ అదనపు చర్యలు తీసుకుంటోందని మైక్రోసాఫ్ట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ (ఎక్స్‌బాక్స్‌) డేవ్‌ మెకార్తి  తెలిపారు. ఫెడరల్‌ కోర్టు ఆమోదం తెలిపిన తర్వాతే మైక్రోసాఫ్ట్‌ సెటిల్‌మెంట్‌ అమల్లోకి వస్తుందని ఎఫ్‌టీసీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని