ధారా వంట నూనెల ధర లీటరుకు రూ.10 తగ్గింపు

మదర్‌ డెయిరీ తమ ధారా వంట నూనెల గరిష్ఠ విక్రయ ధర (ఎంఆర్‌పీ)లను లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది.

Published : 09 Jun 2023 02:14 IST

దిల్లీ: మదర్‌ డెయిరీ తమ ధారా వంట నూనెల గరిష్ఠ విక్రయ ధర (ఎంఆర్‌పీ)లను లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది. వచ్చే వారం నుంచి కొత్త ధరలతో కూడిన ప్యాకెట్లు విపణిలో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అంతర్జాతీయ విపణిలో వంట నూనెల ధరలు తగ్గినందున, దేశీయంగానూ తగ్గిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.  ఇకపై లీటరు నూనె ధరలు రూ.140 నుంచి రూ.230 వరకు ఉండనున్నాయి.

ఆయా రకాల ఎంఆర్‌పీ లీటరుకు

* సోయాబీన్‌ - రూ.140
* రైస్‌బ్రాన్‌ -    రూ.160
* రిఫైన్డ్‌ వెజిటబుల్‌ - రూ.200
* కచి ఘని ఆవాల నూనె - రూ.160
* ఆవాల నూనె - రూ.158
* పొద్దుతిరుగుడు - రూ.150
* వేరుసెనగ - రూ.230

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని