ఇంటి కోసం సిద్ధం ఇలా
సొంతిల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నారా? మీ దగ్గర ఎంత డబ్బుంది? గృహరుణం ఎంత తీసుకోవాలి? ఇలాంటి లెక్కలన్నీ వేసుకున్నారా? ఈ సమయంలో తీసుకునే చిన్న జాగ్రత్తలతోనే లక్షల రూపాయలు ఆదా చేసుకునేందుకు మార్గం దొరుకుతుంది
సొంతిల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నారా? మీ దగ్గర ఎంత డబ్బుంది? గృహరుణం ఎంత తీసుకోవాలి? ఇలాంటి లెక్కలన్నీ వేసుకున్నారా? ఈ సమయంలో తీసుకునే చిన్న జాగ్రత్తలతోనే లక్షల రూపాయలు ఆదా చేసుకునేందుకు మార్గం దొరుకుతుంది. అవేమిటి? రుణం తీసుకునేటప్పుడు ఏ విషయాలు చూడాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గృహరుణం ఒక దీర్ఘకాలిక బాధ్యత. మిగతా రుణాలతో పోలిస్తే ఇది తక్కువ వడ్డీకే అందుబాటులో ఉంటుంది. కానీ, వ్యవధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వడ్డీ భారమూ అదే స్థాయిలో ఉంటుంది. రుణం తీసుకునే ముందు చేతి నుంచి కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ పరిభాషలో దీన్ని డౌన్‌పేమెంట్ లేదా మార్జిన్ మనీ అని పిలుస్తుంటారు. గృహరుణం తీసుకునేటప్పుడు మీ ఇంటి విలువలో ఎంత మొత్తం సొంతంగా చెల్లించాలి, ఎంత రుణం ఇస్తారన్నది ముందే తెలుసుకోవాలి. మీరు అధిక మొత్తం డౌన్ పేమెంట్ చేస్తే, మంచి వడ్డీ రేటుకు రుణాన్ని తీసుకునేందుకు వీలవుతుంది. మరి, ఈ మార్జిన్ మొత్తాన్ని చెల్లించేందుకు మనం ఎలా సిద్ధం కావాలన్నది తెలుసుకుందాం.
- ఆర్థిక ప్రణాళికలో కీలకం డబ్బును ఆదా చేయడం. వచ్చిన ఆదాయాన్ని బట్టి, 50:30:20 నియమాన్ని పాటించేందుకు ప్రయత్నించండి. మీ నెలవారీ జీతంలో 50% స్థిరమైన నెలవారీ ఖర్చులకు వెళ్లాలి. 30 శాతం ఇతర వ్యయాలకు కేటాయించాలి. మిగిలిన 20% పొదుపు, పెట్టుబడులకు మళ్లించాలి. ఈ సూత్రాన్ని పాటించడం ద్వారా డౌన్‌పేమెంట్‌కు అవసరమైన మొత్తాన్ని సాధించేందుకు వీలవుతుంది. పెద్ద మొత్తంలో డబ్బును జమ చేయాలంటే.. పెట్టుబడుల వాటాను పెంచుకుంటూ వెళ్లాలి.
- చిన్న చిన్న మార్పులే రేపు పెద్ద ప్రయోజనాన్ని కలిగిస్తాయి. రెండు మూడేళ్లపాటు ఖర్చులపై నియంత్రణ సాధిస్తే.. పెట్టుబడుల కోసం 30 శాతం లేదా 40 శాతం ఆదాయాన్ని కేటాయించేందుకు వీలవుతుంది. ఇంటి అద్దె ఎక్కువగా ఉంటే.. సొంతిల్లు కొనే వరకూ చిన్న ఇంటికి మారిపోండి. కొత్త వాహనం కొనుగోలును తాత్కాలికంగా వాయిదా వేయండి. విహార యాత్రల విషయాన్ని మరోసారి ఆలోచించుకోండి. ఇది కాస్త ఇబ్బందికరంగానే ఉండొచ్చు. కానీ, పెద్ద మొత్తం జమ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి త్యాగాలు తప్పవు.
- ఇంటి కొనుగోలు కోసం మార్జిన్ మొత్తాన్ని సాధించేందుకు 3-5 ఏళ్లు పట్టొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి, ఇది ఆధారపడి ఉంటుంది. మీరు ఏడాది లోపు ఇల్లు కొనాలని నిర్ణయించుకుంటే.. మీ పెట్టుబడి మొత్తాలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎఫ్డీలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఈపీఎఫ్‌లాంటి వాటి నుంచి డబ్బు తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలూ అందుబాటులో ఉంటాయి. వీటిని తీసుకోకపోవడమే మంచిది. ఇంటి రుణం తీసుకున్న తర్వాత ఇవి మీకు భారం అవుతాయి.
- నష్టాన్ని భరించే శక్తిని బట్టి పెట్టుబడులను ఎంచుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు, షేర్లలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఎన్నాళ్లపాటు డబ్బును పెట్టుబడి పెట్టబోతున్నారు అనేది చూసుకొని, అందుకు అనుగుణంగా పథకాలను ఎంచుకోవాలి. సొంతిల్లు జీవితంలో ఒక కీలక మైలురాయి. దీన్ని సాధించే క్రమంలో ఎలాంటి పొరపాట్లూ చేయొద్దు.
గౌరవ్ మోహతా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఎంత ఉండాలి?
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు, బీమా తీసుకునే వ్యక్తి.. అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని బీమా మొత్తాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. -
పెట్టుబడికి బంగారు బాట...
ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. -
మదుపు చేయాలి.. లక్ష్యం చేరేదాకా
స్టాక్ మార్కెట్లు కొంత అనిశ్చితితో ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీల్లో ప్రత్యక్షంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. -
కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక ధీమా
అనుకోని ప్రమాదం కుటుంబంలో ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి. -
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్‌మార్కింగ్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసా? -
ఆరోగ్య బీమాలో నెట్వర్క్ ఆసుపత్రుల ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి ఆరోగ్య బీమా సంస్థ తన పాలసీదారులకు నగదు రహిత చికిత్సనందించడానికి కొన్ని ఆసుపత్రులతో భాగస్వామ్యాన్ని (టై-అప్) కలిగి ఉంటుంది. దీని వల్ల పాలసీదారులకు ప్రయోజనమేంటో ఇక్కడ తెలుసుకుందాం.. -
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది. -
క్రెడిట్ కార్డుల ద్వారా క్యాష్‌బ్యాక్ ఎలా సంపాదించాలి?
క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులు మీరు వస్తువులను కొనుగోలు చేయడానికి మీ కార్డు స్వైప్ చేసినప్పుడు కొంత డబ్బును తిరిగి పొందేందుకు ఉపయోగపడతాయి. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తాజా వార్తలు (Latest News)
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం కన్నుమూత
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!