విద్యుత్‌ వాహనాలు.. బ్యాటరీల అభివృద్ధికి

వచ్చే 5 ఏళ్లలో మరిన్ని విద్యుత్‌ వాహనాలు ఆవిష్కరించేందుకు, చౌకగా, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలను అభివృద్ధి చేసేందుకు 2 లక్షల కోట్ల యెన్‌ల (1,760 కోట్ల డాలర్లు-సుమారు రూ.1.32 లక్షల కోట్ల) పెట్టుబడులు

Published : 30 Nov 2021 02:05 IST

రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు: నిస్సాన్‌

టోక్యో: వచ్చే 5 ఏళ్లలో మరిన్ని విద్యుత్‌ వాహనాలు ఆవిష్కరించేందుకు, చౌకగా, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలను అభివృద్ధి చేసేందుకు 2 లక్షల కోట్ల యెన్‌ల (1,760 కోట్ల డాలర్లు-సుమారు రూ.1.32 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టబోతున్నట్లు జపాన్‌కు చెందిన నిస్సాన్‌ మోటార్‌ సంస్థ వెల్లడించింది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి తమ సంస్థ నుంచి 15 విద్యుత్‌ వాహనాలు విపణిలోకి వస్తాయని నిస్సాన్‌ సీఈఓ మకోటో ఉచిదా వెల్లడించారు. ‘నిస్సాన్‌ ఆంబిషన్‌ 2030’ ప్రణాళికలో భాగంగా సంస్థ తయారు చేస్తున్న వాహనాల్లో 50 శాతం మోడళ్లను విద్యుదీకరించాలనుకుంటున్నట్లు వివరించారు. విద్యుత్‌ వాహనాల్లో హైబ్రిడ్‌ మోడళ్లు, ఇతర పర్యావరణ హిత ఇంధనంతో నడిచే వాహనాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగానే విద్యుత్‌ వాహనాల ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నామని, అలాగే కంపెనీ ఫ్యాక్టరీల్లోనూ కర్బన ఉద్గారాలను తగ్గించాలనుకుంటున్నట్లు ఉచిదా వెల్లడించారు. సంక్షోభం నుంచి నిస్సాన్‌ బయటకొచ్చిందని, కొత్త అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని