చందాదార్లకు ఎన్‌పీఎస్‌తో మంచి ప్రతిఫలం

పింఛన్‌ ఉత్పత్తుల్లో జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) చందాదార్లకు గత 12 ఏళ్లలో మంచి ప్రతిఫలం అందించిందని పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ.....

Published : 07 Dec 2021 01:42 IST

పీఎఫ్‌ఆర్‌డీఏ ఛైర్మన్‌ సుప్రతిమ్‌

దిల్లీ: పింఛన్‌ ఉత్పత్తుల్లో జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) చందాదార్లకు గత 12 ఏళ్లలో మంచి ప్రతిఫలం అందించిందని పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఛైర్మన్‌ సుప్రతిమ్‌ బంద్యోపాధ్యాయ్‌ సోమవారం వెల్లడించారు. చాలా సులువైన ఈ పథకంలో ముందు చేరిన వారికి, ప్రయోజనాలు కూడా త్వరగా అందుతాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో ఈక్విటీ పథకాల్లో 12 శాతానికి పైగా, ప్రభుత్వ సెక్యూరిటీల్లో 9.9 శాతం ప్రతిఫలం దక్కగా, మేము 9.59 శాతం వార్షిక సంచిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌) సాధించామని తెలిపారు. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌ నిధులు రూ.6.85 లక్షల కోట్ల మేర తమ వద్ద ఉన్నాయని, మంచి ప్రతిఫలాలు చందాదార్లకు అందుతున్నాయని సీఐఐ నిర్వహించిన ఇన్సూరెన్స్‌ అండ్‌ పెన్షన్స్‌ సదస్సులో ఆయన వెల్లడించారు. పీఎఫ్‌ఆర్‌డీఏ కింద ఎన్‌పీఎస్‌, ఏపీవై అనే రెండు రకాల పింఛన్‌ ఉత్పత్తులున్నాయి. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు (ప్రభుత్వ ఉద్యోగులతో కలిపి) ఎన్‌పీఎస్‌ను, అసంఘటిత రంగంలోని వారికి ఏపీవైను (అటల్‌ పింఛన్‌ యోజన) అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని