ఉద్యోగాలు మారేందుకు సిద్ధం

‘కొవిడ్‌ మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ.. భారతీయ ఉద్యోగుల్లో అధికశాతం భవిష్యత్తుపై పూర్తి ఆశాభావంతోనే ఉన్నారు. పెద్ద సంఖ్యలో నిపుణులు తమ ఉద్యోగం మారేందుకూ సిద్ధమ వుతున్నారు’ అని ఆన్‌లైన్‌ ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ లింక్డ్‌ఇన్‌ సర్వేలో

Published : 19 Jan 2022 03:37 IST

అత్యధిక నిపుణుల మాట ఇదే
2022లో ఉద్యోగాల మార్కెట్‌పై లింక్డ్‌ఇన్‌ సర్వే

దిల్లీ: ‘కొవిడ్‌ మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ.. భారతీయ ఉద్యోగుల్లో అధికశాతం భవిష్యత్తుపై పూర్తి ఆశాభావంతోనే ఉన్నారు. పెద్ద సంఖ్యలో నిపుణులు తమ ఉద్యోగం మారేందుకూ సిద్ధమ వుతున్నారు’ అని ఆన్‌లైన్‌ ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ లింక్డ్‌ఇన్‌ సర్వేలో తేలింది. మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం దాదాపు 82 శాతం వృత్తి నిపుణులు 2022లో ఉద్యోగం మారేందుకు యోచిస్తున్నారని తేలింది.

పని-వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడంలో తలెత్తుతున్న ఇబ్బందులు, వేతనాలు ఆశించిన మేర లేకపోవడం, వృత్తిలో మరింత వృద్ధికి వీలు..వంటి అంశాలే ఉద్యోగం మారేందుకు కారణమవుతున్నాయి.

కొత్త ఏడాదిలో అనుకూల పని వాతావరణమే మొదటి ప్రాధాన్యంగా నిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో, ఉద్యోగులు తాము చేస్తున్న కొలువుల గురించి మరోసారి ఆలోచిస్తున్నారని, జీవితంలో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని భావిస్తున్నారని తేలింది. కొత్త అవకాశాలు పెరగడం, భారత్‌లో మారిన పరిస్థితులు నైపుణ్యం ఉన్న వారికి ఐటీ, ఆరోగ్య సంరక్షణ, వ్యాపారాభివృద్ధి రంగాల్లో మంచి ప్రాధాన్యం లభిస్తోందని లింక్డ్‌ఇన్‌ న్యూస్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంకిత్‌ వెంగూల్కర్‌ తెలిపారు. సర్వేలో పాల్గొన్న 37 శాతం మహిళా ఉద్యోగులు పని-వ్యక్తిగత జీవితం సమతౌల్యం కోసం ఉద్యోగాల మార్పు కోరుకుంటున్నారని తేలింది. పురుషుల సంఖ్య 28 శాతం ఉంది. 49 శాతం మంది ఇప్పుడున్న ఉద్యోగాల్లో కొనసాగుతామని, 39 శాతం మంది వేతనం పెరిగితే ఉద్యోగం మారతామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని