40,000 డాలర్ల దిగువకు బిట్‌కాయిన్‌

క్రిప్టో కరెన్సీల విలువలు దిగి వస్తున్నాయి. అత్యంత ఎక్కువగా ట్రేడ్‌ అయ్యే క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్‌ విలువ 40,000 డాలర్లకు దిగి, 38,462 డాలర్లకు చేరింది. ఇది 5 నెలల కనిష్ఠస్థాయి. దీని విలువ శుక్రవారమే

Published : 22 Jan 2022 04:10 IST

క్రిప్టో కరెన్సీల విలువలు దిగి వస్తున్నాయి. అత్యంత ఎక్కువగా ట్రేడ్‌ అయ్యే క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్‌ విలువ 40,000 డాలర్లకు దిగి, 38,462 డాలర్లకు చేరింది. ఇది 5 నెలల కనిష్ఠస్థాయి. దీని విలువ శుక్రవారమే 7.4 శాతం తగ్గింది. మరో క్రిప్టో కరెన్సీ ఈథర్‌ విలువ కూడా 3,000 డాలర్ల దిగువకు చేరింది. నవంబరు గరిష్ఠాల నుంచి ఈ డిజిటల్‌ టోకెన్ల విలువ 1,00,000 కోట్ల డాలర్ల మేర తగ్గిందని కాయిన్‌మార్కెట్‌క్యాప్‌ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేయడంతో పాటు టెక్నాలజీ స్టాక్‌ల పతనంతో క్రిప్టో కరెన్సీలపై ఒత్తిడి పెరిగింది. బినాన్స్‌ కాయిన్‌, కార్డనో, సొలానా తదితర క్రిప్టో కరెన్సీల విలువలు కూడా తగ్గుతున్నాయి. గత రెండేళ్లలో బిట్‌ కాయిన్‌ విలువ నాలుగింతలకు పైగా పెరిగి 69,000 డాలర్లకు చేరింది. అక్కడ నుంచి సుమారు 30,000 డాలర్ల మేర పతనమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని