ఆర్థిక భద్రతకు పెరిగిన ప్రాధాన్యం

కొవిడ్‌-19 పరిణామాల అనంతరం, ఇతర అంశాల కంటే ప్రజలు ఆర్థిక భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నిర్వహించిన సర్వేలో తేలింది.

Published : 24 Feb 2022 03:19 IST

మ్యాక్స్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సర్వే

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 పరిణామాల అనంతరం, ఇతర అంశాల కంటే ప్రజలు ఆర్థిక భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. జీవిత బీమా పాలసీలపై అవగాహన గత రెండేళ్లుగా అధికమైందని తెలిపింది. మ్యాక్స్‌ లైఫ్‌ ‘ఇండియా ప్రొటెక్షన్‌ కోషెంట్‌ (ఐపీక్యూ)’ పేరుతో నాలుగో విడత వార్షిక సర్వేను 2021 డిసెంబరు 10 నుంచి 2022 జనవరి 14 వరకు 25 నగరాల్లో నిర్వహించినట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ ప్రశాంత్‌ త్రిపాఠీ దృశ్య మాధ్యమ సమావేశంలో వెల్లడించారు. ప్రీమియం ఎంతన్నది కాక.. బీమా విలువ అధికంగా ఉందా లేదా అనేదానికే ప్రజలు ప్రాధాన్యమిస్తున్నారని స్పష్టమైనట్లు చెప్పారు. ‘కొవిడ్‌ భయం తగ్గినా, పాలసీదారులు ఆర్థిక రక్షణతో పాటు, దీర్ఘకాలిక లక్ష్యాలపైనా దృష్టి సారిస్తున్నారు. టర్మ్‌ పాలసీలు, పొదుపు, యూనిట్‌ ఆధారిత పాలసీలు తీసుకునేందుకూ మొగ్గు చూపిస్తున్నారు. పిల్లల చదువు, పదవీ విరమణ ప్రణాళికలపై అవగాహన పెంచుకోవడంతో పాటు, కొనుగోలుకూ అధికశాతం మంది ముందుకు వస్తున్నారు. రెండో అంచె నగరాల్లో టర్మ్‌ పాలసీలు బాగా పెరిగాయ’ని త్రిపాఠీ తెలిపారు. నివేదిక అంశాలివీ

* గతంతో పోలిస్తే ప్రజలు ఒకటికి మించి పాలసీలు తీసుకుంటున్నారు. టర్మ్‌ పాలసీలు తీసుకుంటున్న వారి సంఖ్య 39 శాతం నుంచి 43 శాతానికి పెరిగింది. నలుగురిలో ఒకరు టర్మ్‌ పాలసీల ప్రీమియం అధికంగా ఉందని పేర్కొన్నందున, బీమా సంస్థలు దృష్టి సారించాల్సి ఉంది. అధిక విలువ పాలసీని తీసుకోవడమే కాక రైడర్లు, అనుబంధ పాలసీలను జోడించుకునేందుకూ మొగ్గుచూపుతున్నారు. ఆర్థిక భద్రత కోసం యువత, మహిళలు టర్మ్‌ పాలసీపై ఆసక్తి చూపిస్తున్నారు.  ఉద్యోగులు ఎక్కువగా టర్మ్‌, ఇతర బీమా పాలసీలు తీసుకుంటుండగా.. స్వయం ఉపాధి పొందుతున్న వారు టర్మ్‌ పాలసీలను తీసుకోవడం తగ్గిందని వెల్లడైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని