చిన్న, మధ్యతరహా సంస్థలకు బీ2బీ ఐటీ సేవలు

ఐటీ సేవల సంస్థ ఎంఎస్‌ఆర్‌ కాస్మోస్‌ గ్రూపు వచ్చే అయిదేళ్లలో 1 బిలియన్‌ డాలర్ల కంపెనీగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా నూతన తరం ఐటీ సేవల్లోకి అడుగుపెడుతున్నట్లు సంస్థ  ఛైర్మన్‌ ఎం.శివగోపాల్‌ శనివారం కంపెనీ వార్షిక

Published : 03 Jul 2022 02:56 IST

ఎంఎస్‌ఆర్‌ కాస్మోస్‌ గ్రూపు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ సేవల సంస్థ ఎంఎస్‌ఆర్‌ కాస్మోస్‌ గ్రూపు వచ్చే అయిదేళ్లలో 1 బిలియన్‌ డాలర్ల కంపెనీగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా నూతన తరం ఐటీ సేవల్లోకి అడుగుపెడుతున్నట్లు సంస్థ  ఛైర్మన్‌ ఎం.శివగోపాల్‌ శనివారం కంపెనీ వార్షిక సమావేశంలో వెల్లడించారు. ముఖ్యంగా భారతదేశంలో చిన్న, మధ్యతరహా సంస్థలకు బీ2బీ  ఐటీ సేవలు విస్తరించనున్నట్లు తెలిపారు. ఎంఎస్‌ఆర్‌ కాస్మోస్‌ గ్రూపు రూ.1700 కోట్ల వార్షిక ఆదాయాల స్థాయికి చేరుకున్నట్లు, అతి తక్కువ సమయంలో దీన్ని సాధించినట్లు ఆయన వివరించారు. ‘ఫార్చూన్‌ 500’  కంపెనీలకు క్లౌడ్‌, డేటా, ఏఐ, ఆటోమేషన్‌, ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్స్‌ విభాగాల్లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గత మూడేళ్లలో వివిధ టెక్నాలజీ విభాగాలకు చెందిన ఏడు కంపెనీలను కొనుగోలు చేసినట్లు, తత్పలితంగా వేగంగా విస్తరించే అవకాశం లభించినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని