నిఫ్టీ సూచీ కంపెనీల్లో...

ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ ఒక కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ఆవిష్కరించింది. ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ముగింపు తేదీ వచ్చే

Published : 21 May 2021 01:17 IST

ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ ఒక కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ఆవిష్కరించింది. ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ముగింపు తేదీ వచ్చే నెల 2. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. దీని పనితీరును నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ టీఆర్‌ ఇండెక్స్‌తో పోల్చి చూస్తారు. నిఫ్టీ 50 లోని షేర్లన్నీ ఇందులో ఉంటాయి. నిఫ్టీ 50లో ఒక్కో కంపెనీకి దాని మార్కెట్‌ విలువ (మార్కెట్‌ కేపిటలైజేషన్‌) ప్రకారం వెయిటేజీ లభిస్తుంది. కానీ నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ టీఆర్‌ ఇండెక్స్‌లో అన్ని కంపెనీలకు సమానమైన వెయిటేజీ ఉంటుంది. ప్రతి కంపెనీకి 2 శాతం నిధులు కేటాయిస్తారు. దీని వల్ల ‘కాన్సంట్రేషన్‌ రిస్కు’ తగ్గుతుంది. ప్రతి ఆరు నెలలకోసారి నిఫ్టీ 50లో వచ్చే మార్పులకు అనుగుణంగా ఇందులోనూ మార్పులు చోటు చేసుకుంటాయి.
ఆదిత్యా బిర్లా సన్‌ లైఫ్‌ నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ ఫండ్‌లో పోర్ట్‌ఫోలియోను మూడు నెలలకోసారి మార్పులు చేస్తారు. తత్ఫలితంగా ‘ప్రాఫిట్‌ బుకింగ్‌’ జరిగి పోర్ట్‌ఫోలియో రీ-బ్యాలెన్స్‌ అవుతుంది. ఆర్థిక వ్యవస్థ కోలుకొని అన్ని రంగాలు మెరుగైన పనితీరు ప్రదర్శించే పరిస్థితి వచ్చినప్పుడు నిఫ్టీ 50 ఈక్వల్‌ వెయిట్‌ ఇండెక్స్‌ మంచి ప్రతిఫలాన్ని నమోదు చేసే అవకాశం ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు ఆదిత్యా బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని