బీఓబీ గృహరుణం 6.50%

పండగల వేళ రుణ గ్రహీతలకు ప్రయోజనం కలిగించేలా 6.50శాతం వడ్డీకే గృహరుణాన్ని ఇస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) తెలిపింది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించింది.

Updated : 08 Oct 2021 02:17 IST

పండగల వేళ రుణ గ్రహీతలకు ప్రయోజనం కలిగించేలా 6.50శాతం వడ్డీకే గృహరుణాన్ని ఇస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) తెలిపింది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించింది. ఈ ప్రత్యేక వడ్డీ రేటు డిసెంబరు 31 వరకూ తీసుకున్న రుణాలకు వర్తిస్తుంది. ఈ వడ్డీ రేటు కొత్తగా రుణాన్ని తీసుకోబోయే వారితోపాటు, ఇతర బ్యాంకులో ఉన్న రుణాలను బదిలీ చేసుకునే వారికీ వర్తిస్తుంది. పరిశీలనా రుసుములనూ బ్యాంకు రద్దు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని