మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంకుల వరాలు

మీరు అధిక క్రెడిట్ స్కోర్ను కలిగి ఉన్నట్లైతే ఇప్పుడు తక్కువ వడ్డీకే గృహ రుణాన్ని పొందవచ్చు. సిబిల్ స్కోర్ 760 అంతకంటే ఎక్కువ ఉన్న వారికి బ్యాంకు అఫ్ ఇండియా తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాన్ని అందిస్తున్నట్లు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్రాన్స్యూనియన్

Published : 18 Dec 2020 16:11 IST

మీరు అధిక క్రెడిట్ స్కోర్ను కలిగి ఉన్నట్లైతే ఇప్పుడు తక్కువ వడ్డీకే గృహ రుణాన్ని పొందవచ్చు. సిబిల్ స్కోర్ 760 అంతకంటే ఎక్కువ ఉన్న వారికి బ్యాంకు అఫ్ ఇండియా తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాన్ని అందిస్తున్నట్లు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్రాన్స్యూనియన్ సిబిల్ ప్రకటించింది.

క్రెడిట్ స్కోరు 760 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వారు రూ. 30 లక్షలు అంతకంటే ఎక్కువ గృహ రుణాన్ని పొందాలని అనుకుంటే, క్రెడిట్ స్కోర్ 760 కంటే తక్కువ ఉన్న వారి కంటే సుమారు 10 బేసిస్ పాయింట్లు తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందుతారు. అధిక స్కోరు కలిగిన రుణగ్రహీతలు నిధుల ఆధారిత రుణ రేటును ఒక సంవత్సర తక్కువ ఖర్చుతో పొందుతారు. అదే తక్కువ క్రెడిట్ స్కోరు కలిగిన వారు 10 బేసిస్ పాయింట్స అధిక రేటును చెల్లించాలి. ఎమ్సీఎల్ఆర్ అనేది బ్యాంకు రుణాలకు ఇచ్చే కనీస రేటు.

ఉదాహరణకు 20 సంవత్సరాల కాలానికి గాను 8.5 శాతం వడ్డీ రేటుతో మీరు రూ.30 లక్షలు రుణం తీసుకుంటే, రూ.ఒక లక్షకు ఈఎంఐ కింద మీరు రూ. 867 చెల్లించవలసి ఉంటుంది. అదే వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు మేర తగ్గిపోతే మీరు చెల్లించవలసిన ఈఎంఐ రూ. 861 గా ఉంటుంది. చివరగా రూ. 30 లక్షలకు గాను మీ ఈఎంఐ రూ. 26,035 నుంచి రూ. 25,845 కు తగ్గిపోతుంది. క్రెడిట్ స్కోర్ మంచిగా ఉండడం వలన మీరు నెలకు రూ.190 తక్కువగా చెల్లిస్తారు.

సిబిల్ డైరెక్టర్ హృషికేష్ మెహతా వినియోగదారుల చర్చావేదికలో మాట్లాడుతూ బ్యాంకులు మంచి క్రెడిట్ స్కోర్ కలిగిన వినియోగదారులకు ప్రత్యేకమైన బహుమతులను ఇవ్వడం ప్రారంభించాయని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 2017 సంవత్సరంలోనే వినియోగదారుల కోసం ఆఫర్ను ప్రారంభించింది. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అనంతరం ఐడిబిఐ బ్యాంక్ కూడా ఇదే రకమైన చర్యలు తీసుకుందని మెహతా తెలిపారు.

జనవరి, 2017 సంవత్సరంలో, బ్యాంక్ ఆఫ్ బరోడా 760 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వినియోగదారులకు గృహ రుణాలను ఎమ్సీఎల్ఆర్ వద్ద అందించడం ప్రారంభించింది. దీనితో పాటు ఉచితంగా బేస్ రేటును ఎమ్సీఎల్ఆర్ ఆధారిత రేట్ గా మార్చేందుకు వీలు కల్పించింది.

బ్యాంకు అఫ్ ఇండియా ఆఫర్
ఇటీవల మంచి క్రెడిట్ స్కోర్ కలిగిన వినియోగదారులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకమైన ఆఫర్ ను ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ప్రకారం, జూన్ 30, 2018 వరకు బ్యాంకు స్టార్ హోమ్ రుణ పథకం కింద రుణగ్రహీతలు రూ.30 లక్షల వరకు గృహ రుణాన్ని ఎమ్సీఎల్ఆర్ వద్ద పొందుతారు. క్రెడిట్ స్కోర్ వర్గీకరణ రూ. 30 లక్షల వరకు తీసుకునే రుణాలపై పేర్కొనలేదు. 760 అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వినియోగదారులు రూ.30 లక్షల కన్నా ఎక్కువ గృహ రుణాన్ని ఎమ్సీఎల్ఆర్ వద్ద పొందుతారు. అదే తక్కువ క్రెడిట్ స్కోరు కలిగిన వారు ఎమ్సీఎల్ఆర్ తో పాటు అదనంగా 10 బేసిస్ పాయింట్లతో గృహ రుణాన్ని పొందుతారు. 
క్రెడిట్ బ్యూరోలు అందించే క్రెడిట్ స్కోర్లను పరిగణించాలా లేక పాత బేస్ రేట్ ఆధారిత గృహ రుణాల వినియోగదారులు ఈ ఆఫర్ని పొందవచ్చా లేదో అనే దానిపై బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించలేదు.

మీరు ఏమి చేయాలి
అనేక బ్యాంకులు వారందించే గృహ రుణాలను ప్రచారం చేసుకోడానికి ఎమ్సీఎల్ఆర్ ను ఉపయోగించుకుంటాయి. ఎమ్సీఎల్ఆర్ రేటుకు గృహ రుణాలను అందిస్తే ఎక్కువ మంది రుణం తీసుకోడానికి ముందుకువస్తారు. కానీ చాలా సందర్భాల్లో, ఖాతాదారులకు లభించే రుణ తుది వడ్డీ రేటు ఎమ్సీఎల్ఆర్ కు అదనం.

ఆర్థిక సలహాదారు, శ్రీజన్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ లిమిటెడ్ యజమాని అయిన దీపాలి సేన్ తెలిపినదాని ప్రకారం క్రెడిట్ స్కోరు అనేది ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని, చాలా సందర్భాలలో ఇది ఎమ్సీఎల్ఆర్ కు అదనంగా 15 నుంచి 20 బేసిస్ మార్క్ గా ఉంటుందని తెలిపారు. మా అనుభవంలో కేవలం కొత్త బ్యాంకులు మాత్రమే ఎమ్సీఎల్ఆర్ వద్ద గృహ రుణాలను అందిస్తున్నాయని, కానీ వారి ఎమ్సీఎల్ఆర్ పాత బ్యాంకులు, పెద్ద బ్యాంకుల ఎమ్సీఎల్ఆర్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని దీపాలి సేన్ తెలిపారు.

గృహ రుణంపై 20 బేసిస్ పాయింట్ల వ్యత్యాసం గణనీయమైన ప్రభావం చూపుతుందని దీపాలి సేన్ తెలిపారు. అలాగే మీరు గృహ రుణం తీసుకోవాలనుకుంటున్న బ్యాంకులో ప్రక్రియ ఎంత సులువుగా ఉంది, బ్యాంకు ట్రాక్ రికార్డు ఎలా ఉంది, ఎప్పటికప్పుడు ఎమ్సీఎల్ఆర్ ను సవరిస్తుందో లేదో వంటి విషయాలను ఖాతాదారులు గమనించవలసిన ఉంటుందని దీపాలి సేన్ తెలిపారు.మంచి క్రెడిట్ స్కోరు కారణంగా తక్కువ వడ్డీ రేటుకే రుణాన్ని పొందడం వలన మీరు ఎక్కువ మొత్తంలో ప్రయోజనం పొందుతారు. ప్రస్తుతం గృహ రుణం అవసరం లేని వారు తమ క్రెడిట్ స్కోర్ ను మరింత మెరుగు పరుచుకోడానికి ప్రయత్నించండి. దీని ద్వారా మీరు భవిష్యత్తులో బ్యాంకులు అందించే అనేక ప్రయోజనాలకు అర్హులుగా ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని