విద్యా రుణం తీసుకోవాలనుకుంటున్నారా? ఇవి దృష్టిలో పెట్టుకోండి

ఈ రోజుల్లో పిల్ల‌ల‌ ఉన్న‌త విద్య కోసం త‌ల్లిదండ్రులు దిగులు చెందాల్సిన అవ‌స‌రం లేదు. విద్యార్థులే స్వ‌యం గా విద్యా రుణాల‌ను పొంది త‌ర్వాత చెల్లించ‌వ‌చ్చు. గ‌త 10-15 ఏళ్లుగా విద్యా రుణాల‌తో వ్య‌వ‌స్థ‌లో మార్పు క‌నిపిస్తుంది. అయితే రుణం ఎందుకు తీసుకుంటున్నారో మీకు స్ప‌ష్ట‌త ఉండాల్సిన

Published : 18 Dec 2020 19:26 IST

ఈ రోజుల్లో పిల్ల‌ల‌ ఉన్న‌త విద్య కోసం త‌ల్లిదండ్రులు దిగులు చెందాల్సిన అవ‌స‌రం లేదు. విద్యార్థులే స్వ‌యం గా విద్యా రుణాల‌ను పొంది త‌ర్వాత చెల్లించ‌వ‌చ్చు. గ‌త 10-15 ఏళ్లుగా విద్యా రుణాల‌తో వ్య‌వ‌స్థ‌లో మార్పు క‌నిపిస్తుంది. అయితే రుణం ఎందుకు తీసుకుంటున్నారో మీకు స్ప‌ష్ట‌త ఉండాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. మీ ల‌క్ష్యాలు, ఉద్యోగ అవ‌కాశాలు, మీరు తీసుకుంటున్న కోర్సు మీ ల‌క్ష్యాల‌ను నెర‌వేరుస్తుందా లేదా, తీసుకునే రుణాన్ని తిరిగి చెల్లించే స్థోమ‌త‌, విశ్వాసం ఉందా అని ఒక‌సారి విశ్లేషించుకొని సిద్ధ‌మ‌వ్వాలి.

విద్యా రుణం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విష‌యాలు…

మంచి ఉద్యోగ అవకాశాలు:

కోర్సు పూర్తి చేసిందుకు లేదా కొన్ని రోజులు ఉద్యోగం చేసిన త‌ర్వాత మంచి ఉద్య‌గం కోసం మ‌రో డిగ్రీ చ‌దవాల‌నుకుంటే దానికోసం విద్యారుణం తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఆ కోర్సుపై ఉన్న‌ ఉద్యోగ అవ‌కాశాల గురించి పూర్తిగా తెలుసుకోండి. త‌ర్వాత మీరు ఎంత సంపాదిచ‌గ‌ల‌రు . వ‌చ్చే వేత‌నంతో రుణం చెల్లించేందుకు స‌రిపోతుందా లేదా అన్నిది చూసుకోవాలి. ఎం

రుణాన్ని పోల్చి చూసుకోండి:

ఏ కోర్సు చ‌ద‌వాల‌నుకుంటున్నారో నిర్ణ‌యించుకున్న త‌ర్వాత కోర్సు పూర్త‌య్యేంత‌వ‌ర‌కు సౌక‌ర్యంగా ఉండేందుకు మీకు ఏ రుణం స‌రిపోతుందో తెలుసుకోవాలి. బ్యాంకులు, ప్రైవేటు ఆర్థ‌క సంస్థ‌లు ఇచ్చే విద్యా రుణాల‌ను ప‌రిశీలించాలి. వ‌డ్డీ రేట్లు, వాయిదాలు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ పేమెంట్ ఛార్జీల వంటివి పోల్చి చూసుకోవాలి. విద్యా రుణంలో ట్యూష‌న్ ఫీజు, స్టీడీ మెటీరియ‌ల్, సామాగ్రి, వ‌స‌తులు వంటివి అన్నింటికి రుణం పొందే అవ‌కాశం ఉందా లేదా త‌ర్వాత చెల్లించే గ‌లిగే సామ‌ర్థ్యం ఉన్న దానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

విద్యా రుణంపై ప‌న్ను:

ఆదాయ ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 80ఈ కింద విద్యారుణాపై చెల్లించే వ‌డ్డీ రేట్ల‌కు ప‌న్ను ఉంటుంది. న‌మోదిత బ్యాంకులు, ఆర్థిక‌ సంస్థ‌ల నుంచి తీసుకున్న రుణాల‌కు ఇది వ‌ర్తిస్తుంది. చెల్లిస్తున్న మొత్తం వ‌డ్డీని క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంది. ఇది ఎనిమిదేళ్లు లేదా మీరు పూర్తిగా రుణం చెల్లించేంంత‌వ‌ర‌కు ఏది ముందు పూర్త‌యితే అప్ప‌టివ‌ర‌కు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

వాయిదాలు త‌ప్ప‌కుండా చెల్లించాలి:

కోర్సు పూర్త‌యి ఉద్యోగంలో చేరిన త‌ర్వాత మీరు ప‌నిచేస్తున్న సంస్థ లేదా కంపెనీ ఏదైనా ఇబ్బందుల చేత మూసివేస్తే, అనుకోకుండా మీ ఉద్యోగం పోతే ఏంటీ పరిస్థితి. తీసుకున్న రుణం అయితే తిరిగి చెల్లించ‌క త‌ప్ప‌దు. అందుకే ఉద్యోగంలో చేరిన‌ప్ప‌టినుంచే ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకొని డ‌బ్బు పొదుపు చేసుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి. 6 నుంచి 8 నెల‌ల ఖ‌ర్చులను అత్య‌వ‌సర‌నిధిగా ఏర్ప‌రుచుకోవాలి. అప్పుడు ఉద్యోగం పోయినా స‌మ‌యానికి వాయిదాలు చెల్లించ‌వ‌చ్చు. దీంతో మీ క్రెడిట్ స్కోర్ మీద ఎలాంటి ప్ర‌భావం ఉండ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని