Google Passkeys: పాస్వర్డ్ లేకుండా ఖాతా లాగిన్.. గూగుల్ పాస్‌కీస్ గురించి తెలుసా?
గూగుల్ (Google) యూజర్లు తమ ఖాతాలను పాస్వర్డ్, టూ-స్టెప్ వెరిఫికేషన్‌తో లాగిన్ అవసరం లేకుండా కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ పనిచేయాలంటే డెస్క్‌టాప్ కంప్యూటర్లు విండోస్ 11, మ్యాక్ఓఎస్ వెంచురా ఓఎస్‌లతో.. మొబైల్లో ఆండ్రాయిడ్ 9, ఐఓఎస్ 16 ఆపై వెర్షన్ ఓఎస్‌లతో పనిచేస్తుండాలి.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ పాస్వర్డ్ దినోత్సవం (World Password Day) సందర్భంగా యూజర్లకు గూగుల్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటా మే నెల మొదటి గురువారం రోజున వరల్డ్ పాస్వర్డ్ డేగా జరుపుతారు. ఈ క్రమంలోనే గూగుల్ పాస్‌కీస్ (Google Passkeys) ఫీచర్‌ను పరిచయం చేసింది. తరచూ తమ ఆన్లైన్ ఖాతాలకు పాస్వర్డ్ మర్చిపోయే యూజర్లకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో యూజర్లు తమ ఆన్లైన్ ఖాతాలను పాస్వర్డ్, టూ-స్టెప్ వెరిఫికేషన్ అవసరం లేకుండా ఫింగర్‌ప్రింట్, ఫేస్ స్కాన్ లేదా స్క్రీన్ లాక్ పిన్ సాయంతో లాగిన్ చేయొచ్చు. అలాగే యూజర్ల ఖాతాలకు అదనపు భద్రత ఉంటుందని గూగుల్ తెలిపింది.
గూగుల్ యూజర్లు ఈ ఫీచర్‌ను ముందుగా ఎనేబుల్ చేయాలి. ఇందుకోసం గూగుల్ ఖాతా ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేయాలి. అందులో మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ (Manage Your Google Account)పై క్లిక్ చేసి సెక్యూరిటీ (Security)సెక్షన్లోకి వెళితే పాస్‌కీస్ (Passkeys) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే మీ ఖాతాకు పాస్‌కీస్ ఫీచర్ యాక్టివేట్ అయినట్లు మెసేజ్ చూపిస్తుంది. మొబైల్లో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ స్కాన్ ఆప్షన్లతో పాస్కీ ఆటోమేటిగ్గా క్రియేట్ అవుతుంది. లేదా క్రియేట్ పాస్కీ ఆప్షన్‌తో యూజర్ కొత్త కీని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మొబైల్ లాగిన్ కోసం పిన్, ఫింగర్ ప్రింట్ స్కాన్, ఫేస్ స్కాన్లలో ఏ ఒక్కటి ఎనేబుల్ చేయకపోతే వాటిని ఎనేబుల్ చేయమని సూచిస్తుంది.
డెస్క్‌టాప్ వెర్షన్లో కీబోర్డ్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ ఉంటే పాస్కీ క్రియేట్ చేసుకోవచ్చు. పెన్‌డ్రైవ్‌ల తరహాలో ఉండే కొన్ని పాస్‌కీస్ యూఎస్బీ డ్రైవ్‌లను కూడా ఇందుకోసం ఉపయోగించవచ్చు. ప్రస్తుతం కొన్ని మొబైల్ యాప్‌లకు ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ తరహాలో గూగుల్ ఖాతాలకు పాస్‌కీస్ పనిచేస్తాయి. పాస్‌వర్డ్‌ల తరహాలో గుర్తుంచుకోవడం కోసం వీటిని ఎక్కడా రాయాల్సిన అవసరంలేదు. ఒకవేళ కొత్తగా ఏదైనా డివైజ్‌లో గూగుల్ ఖాతా లాగిన్ చేసేప్పుడు పాస్వర్డ్ ఆప్షన్‌కు బదులు పాస్‌కీస్ ఆప్షన్‌ను ఎంచుకుని ఫింగర్ ప్రింట్, ఫేస్ స్కాన్, పిన్ సాయంతో లాగిన్ చేయొచ్చు. దానివల్ల ఇతరులు గూగుల్ ఖాతాలను యాక్సెస్ చేయలేరు. అయితే, ఈ ఫీచర్ కోసం డెస్క్‌టాప్ కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్ విండోస్ 11, యాపిల్ మ్యాక్ఓఎస్ వెంచురా ఓఎస్‌లతో.. మొబైల్లో ఆండ్రాయిడ్ 9, ఐఓఎస్ 16 ఆపై వెర్షన్ ఓఎస్‌లతో పనిచేస్తుండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్, యాపిల్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
Microsoft app store: గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సిద్ధమవుతోంది. త్వరలో గేమ్స్ స్టోర్‌ను తీసుకురానుంది. -
వాయిస్ ఇన్పుట్ రిమోట్‌తో అమెజాన్ 4K ఫైర్‌స్టిక్.. ధరెంత?
Amazon Fire TV Stick: అమెజాన్ కొత్త ఫైర్ స్టిక్‌ను లాంచ్ చేసింది. 4కె సపోర్ట్‌తో ఇది వస్తోంది. -
మోటో నుంచి రెండు కొత్త ఇయర్‌బడ్స్.. ధర, ఫీచర్లు ఇవే..
Moto: 50dB, 46dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు సపోర్ట్ చేసే రెండు కొత్త ఇయర్‌బడ్స్‌ను మోటో భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. -
యాపిల్ నుంచి ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, పెన్సిల్.. ధర, విశేషాలు ఇవీ..
Apple Let Loose Event 2024: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ లెట్ లూజ్ ఈవెంట్లో కొత్త ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, యాపిల్ పెన్సిల్ ప్రోలను ఆవిష్కరించింది. -
భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
Google Wallet: టికెట్లు, పాసులు, ఐడీలను భద్రపర్చుకునేందుకు వీలుగా గూగుల్ డిజిటల్ వాలెట్‌ను భారత్‌లో విడుదల చేసింది. -
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ 64ఎంపీ కెమెరా సహా అత్యాధునిక ఏఐ ఫీచర్లతో భారత్‌లో విడుదలైంది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్‌ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్‌స్టాలో 4 కొత్త ఫీచర్లు
Instagram: ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా నాలుగు ఫీచర్లను యాడ్ చేసింది. అవేంటో చూసేయండి. -
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్‌లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది. -
50 గంటల బ్యాటరీ లైఫ్‌తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
Noise Pop Buds: నాయిస్ మరో ట్రూవైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
Amazon- Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కాట్ ఏటా వేసవిలో నిర్వహించే సేల్స్ మొదలయ్యాయి. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లపై ఓ లుక్కేయండి. -
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
Vivo V30e: మొబైల్ తయారీ కంపెనీ 3 ఏళ్లు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్తో కొత్త మొబైల్‌ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
WhatsApp: ఇకపై వాట్సప్‌లో ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు. ఎవరెవరు వస్తారో కూడా తెలుసుకోవచ్చు. వారికి నోటిఫికేషన్ ద్వారా గుర్తు చేయొచ్చు. అందుకు అనుగుణంగా కమ్యూనిటీలో ఈవెంట్స్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సప్. -
లింక్డిన్లోనూ గేమ్స్.. మెదడుకు పదును పెట్టే పజిల్స్
LinkedIn: మెదడుకు పదును పెట్టే ఆటలతో యూజర్లను ఆకర్షించేందుకు లింక్డిన్ సిద్ధమైంది. అందులో భాగంగా మూడు పజిల్ గేమ్స్‌ను ప్రవేశపెట్టింది. -
వాట్సప్‌లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్‌లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది. -
గూగుల్‌తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్‌ను ఎలా వాడాలి?
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లిష్‌లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. -
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
ఎయిర్‌టెల్‌తో సన్ నెక్స్ట్ జట్టు కట్టింది. తద్వారా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో సన్ నెక్స్ట్ కంటెంట్‌ను వీక్షించేందుకు వీలు కలగనుంది. -
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
BSNL: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు తమ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్స్టలేషన్ ఛార్జీలు వసూలు చేయబోమని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. -
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
Wearable AC: మెడపై ధరించి ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగలిగేలా సోనీ ఓ కొత్త ఏసీ డివైజ్‌ను తీసుకొచ్చింది. -
భారత్‌లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్‌లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్‌తో నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్‌లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్