PhonePe: ఫోన్‌పేలో ఉచితంగా క్రెడిట్‌ స్కోర్‌.. ఎలా చెక్‌ చేసుకోవాలి?

PhonePe: ఫోన్‌పే ‘క్రెడిట్‌’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా క్రెడిట్‌ స్కోర్‌తో పాటు క్రెడిట్‌ కార్డు బిల్లు, రుణ చెల్లింపుల సమాచారాన్నీ సమర్థంగా నిర్వహించుకోవచ్చు. 

Updated : 02 Jan 2024 14:08 IST

PhonePe | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే (PhonePe) ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. తాజాగా ‘క్రెడిట్‌’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంట్లో క్రెడిట్‌ స్కోర్‌తో (Credit Score) పాటు, క్రెడిట్‌ హిస్టరీని ఉచితంగానే తెలుసుకోవచ్చు. అలాగే క్రెడిట్‌ కార్డుల (Credit Card) నిర్వహణ, బిల్లు, రుణ వాయిదాల చెల్లింపుల వివరాలను కూడా ఈ ఫీచర్‌తో సమర్థంగా మేనేజ్‌ చేసుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది.

ఫోన్‌పే (PhonePe) యాప్‌ను ఓపెన్‌ చేయగానే హోమ్‌పేజీలోనే ‘క్రెడిట్‌’ అనే ట్యాబ్‌ కనిపిస్తుంది. ఒకవేళ అది కనిపించకపోతే.. యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. ‘క్రెడిట్‌’పై క్లిక్‌ చేస్తే ‘క్రెడిట్‌ స్కోర్‌ ఫర్‌ ఫ్రీ’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాని కిందే ‘చెక్‌ నౌ’ అనే బటన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score) మీ ముందుంటుంది. ఈ స్కోర్‌ను ఎక్స్‌పీరియెన్‌ క్రెడిట్‌ బ్యూరో అందిస్తోంది. ఈ స్కోర్‌తో పాటు సకాలంలో చెల్లింపులు, క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి, క్రెడిట్‌ ఏజ్‌, క్రెడిట్‌ మిక్స్‌, రుణ ఎంక్వైరీల వంటి ఇతర సమాచారం కూడా చూసుకోవచ్చు.

ఈ ఫీచర్‌లో మేనేజ్‌ క్రెడిట్స్‌, రుణ ప్రొఫైల్‌, పేమెంట్‌ డ్యూస్‌ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వీటి ద్వారా క్రెడిట్‌ కార్డుల నిర్వహణ, రుణ చెల్లింపుల వంటి సమాచారాన్ని సమర్థంగా నిర్వహించుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది. సంబంధిత సమాచారాన్ని ఎంటర్‌ చేసి ఎప్పటికప్పుడు బిల్లు, ఈఎంఐల చెల్లింపుల స్థితిని సమీక్షించుకోవచ్చు. అయితే, ఫోన్‌పేలో లాగిన్‌ అయిన ఫోన్‌నెంబర్‌.. పాన్‌తో అనుసంధానమైన నెంబర్‌ ఒకటే అయి ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని