SIP: సిప్‌ ద్వారా రూ.5 కోట్లు పొందాలంటే ఎన్నేళ్లు పడుతుంది?

సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(SIP) ద్వారా ఎన్ని సంవత్సరాలకు, ఎంత మొత్తం ఇన్వెస్ట్‌ చేస్తే రూ.5 కోట్లు సమకూరుతుందో ఇక్కడ చూడండి.

Updated : 09 May 2023 17:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రత్యక్షంగా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిలేనివారు ఎక్కువగా మ్యూచువల్‌ ఫండ్లను ఆశ్రయిస్తుంటారు. ఒకేసారి ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టకుండా నెలవారీగా కొంత మొత్తం మ్యూచువల్‌ ఫండ్లలో సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (SIP) ప్రాదిపదికన పెట్టుబడులు పెట్టొచ్చు. మదుపుదార్లు ఎంపిక చేసుకున్న మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ ఈ SIP ద్వారా వచ్చిన మొత్తాన్ని ఎంపిక చేసిన కొన్ని కంపెనీల షేర్లను (యూనిట్ల రూపంలో) కొనుగోలు చేస్తుంది. అలా ప్రతి వాయిదాలో కొన్ని యూనిట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ SIP వల్ల ప్రయోజనం ఏంటంటే ఏకమొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే, మార్కెట్‌లోని ఒడుదొడుకుల నుంచి రక్షణ లభిస్తుంది. వివిధ గణాంకాల ప్రకారం SIP పథకాలు దీర్ఘకాలంలో రెండంకెల వృద్ధిని అందిస్తుండడం వల్ల కూడా చాలా మంది వీటిని ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ రూ.5 కోట్లు మొత్తం సిప్‌ ద్వారా సమకూర్చుకోవడానికి 12% CAGR (వార్షిక రాబడితో) నెలవారీ ఎంత మొత్తం, ఎన్ని సంవత్సరాలు మదుపు చేయాలో ఇప్పుడు చూద్దాం..

గమనిక: పైన తెలిపిన రాబడి అంచనా మాత్రమే. ఈక్విటీ పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని