Retirement: పదవీ విరమణ తర్వాత నెలకు రూ.1 లక్ష పొందాలంటే?

పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ లాంటి ఆదాయం దాదాపుగా అందరికీ అవసరమే. ప్రతి నెలా రూ.1 లక్ష ఆదాయాన్ని పొందడానికి మ్యూచువల్‌ ఫండ్లలో ఎంత ఇన్వెస్ట్‌ చేయాలో ఇక్కడ చూడండి.

Published : 10 Oct 2023 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పదవీ విరమణ తర్వాత జీవన వ్యయానికి ప్రతి ఒక్కరికీ ఆదాయం అవసరమే. అయితే, పదవీ విరమణ తర్వాత ఆదాయం వచ్చే అవకాశం అందరికీ ఉండదు. పెద్ద మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్‌లో మదుపు చేసి అక్కడి నుంచి ప్రతి నెలా ఒక ఫిక్స్‌డ్‌ మొత్తాన్ని పొందొచ్చు. కానీ, అధిక మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టినప్పుడు ఒకేసారి మార్కెట్‌ క్రాష్‌ అయితే పరిస్థితి ఏంటనే అనుమానాలు రావచ్చు. అంతేకాకుండా పదవీ విరమణ వయసులో పెద్ద స్థాయిలో ఆర్థిక ఆటుపోట్లు కూడా అంత మంచివికావు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మ్యూచువల్‌ ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించి ఆర్థిక ఒత్తిడి తగ్గించుకోవచ్చో ఇక్కడ చూద్దాం.. 

మీ వద్ద రూ.1.37 కోట్ల పదవీ విరమణ మొత్తం ఉందనుకుందాం. ఈ మొత్తాన్ని ఒకేసారి మ్యూచువల్‌ ఫండ్‌ ద్వారా మార్కెట్లలో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేసేయకూడదు. ఈ మొత్తాన్ని 3 సంవత్సరాలకు విభజించి ఏదైనా తక్కువ రిస్క్‌ ఉన్న హైబ్రిడ్‌ ఫండ్‌లో సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (SIP) చేయాలి. హైబ్రిడ్‌ ఫండ్లు.. డెట్‌, ఈక్విటీ కలయిక. కాబట్టి రిస్క్‌ కొద్దిగా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మూడేళ్ల పాటు ప్రతి నెలా రూ.3.80 లక్షలను హైబ్రిడ్‌ ఫండ్‌లోకి సిప్‌ చేయచ్చు. ఇలా సిప్‌ చేసిన మొత్తంతో 3 ఏళ్ల కాలవ్యవధిలో (8% రాబడిని అంచనా ప్రకారం) దాదాపు రూ.1.56 కోట్ల మొత్తం జమవుతుంది. ఇప్పుడు ఆ మొత్తంతో 25 ఏళ్ల పాటు సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (SWP) ద్వారా ప్రతి నెలా రూ. 1 లక్షను పొందొచ్చు. 25 ఏళ్ల తర్వాత మీ పెట్టుబడి మొత్తం దాదాపు రూ.1.56 కోట్లు అలాగే మిగిలి ఉంటుంది. రాబడి 8% కన్నా ఎక్కువ ఆశించినట్లైతే మీ పెట్టుబడిని తగ్గించుకోవచ్చు. ఈ వివరాలు ఈ కింది పట్టికలో చూడండి.

గమనిక: మ్యూచువల్‌ ఫండ్లు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఫండ్ల ఎంపిక కూడా చాలా ముఖ్యం. గతంలో మంచి రాబడిని ఇచ్చిన ఫండ్‌ భవిష్యత్‌లో కూడా అదే రాబడి ఇవ్వకపోవచ్చు. కాబట్టి SWPకు అత్యంత అనుకూలమైన ఫండ్‌ను ఎంచుకోడానికి సెబీ ధ్రువీకరించిన ప్రొఫెషనల్‌ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం చాలా ముఖ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని