WhatsApp:వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌.. కాంటాక్ట్‌ సేవ్‌ చేయకుండానే మెసేజ్‌

వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాంటాక్ట్‌ను సేవ్‌ చేయకుండానే మెజేస్‌ చేసేందుకు వీలుకల్పించింది.

Published : 18 Jul 2023 21:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేంజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (Whatsapp) తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మొబైల్‌ నెంబర్‌ను సేవ్‌ చేయకపోయినా.. అవతలి వ్యక్తికి మెసేజ్‌ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ ఫీచర్‌ ఐఓఎస్‌తోపాటు ఆండ్రాయిడ్‌ వినియోగదారులు కొందరికి అందుబాటులోకి వచ్చింది. ఇంతకు ముందు కాంటాక్ట్‌ నెంబర్‌ సేవ్‌ చేసుకుంటేనే మెసేజ్‌ చేసేందుకు వీలుండేది. తాజా ఫీచర్‌తో ఇకపై ఆ అవసరం ఉండదు.

ఈ ఫీచర్‌ పొందడం ఎలా?

  • వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌చేసిన తర్వాత ‘స్టార్ట్‌ న్యూ చాట్‌’ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఏ నెంబర్‌కు మెసేజ్‌ చేయాలనుకుంటున్నామో.. ఆ ఫోన్‌నెంబర్‌ను సెర్చ్‌ బార్‌లో ఎంటర్‌ చేయాలి.
  • వాట్సాప్‌ ఆ నెంబర్‌ను సెర్చ్‌ చేసి సంబంధిత వ్యక్తికి మెజేస్‌ చేసేలా ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తుంది.
  • అయితే ఈ ఫీచర్‌ గురించి వాట్సాప్‌ ఇంత వరకు అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు. వాబీటా ఇన్ఫో ఈ విషయాన్ని పేర్కొంది.
  • ప్లేస్టోర్‌లోగానీ, యాప్‌స్టోర్‌లో గానీ వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకొని ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిందో లేదో చెక్‌ చేసుకోవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని