కూతురికి ఫ్లాట్‌ గిఫ్ట్‌గా ఇస్తే పన్ను వర్తిస్తుందా?

ఓ తండ్రి తన కూతురికి ఫ్లాట్‌ని బహుమానంగా ఇస్తే పన్ను వర్తిస్తుందా? వర్తిస్తే ఎవరు దాన్ని భరించాల్సి ఉంటుంది. దానిపై అద్దె రూపంలో సమకూరే ఆదాయంపై పన్ను సంగతేంటి?ఒకవేళ ఆ ఫ్లాట్‌ని అమ్మితే వచ్చే మూలధన రాబడిపై పన్నులు వర్తిస్తాయా? ఇలాంటి సందేహాలు సహజం కదా! మరి ఈ వివరాలపై ఓ లుక్కేద్దాం..........

Published : 03 Apr 2021 16:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ తండ్రి తన కూతురికి ఫ్లాట్‌ని బహుమతిగా ఇస్తే పన్ను వర్తిస్తుందా? వర్తిస్తే ఎవరు దాన్ని భరించాల్సి ఉంటుంది. దానిపై అద్దె రూపంలో సమకూరే ఆదాయంపై పన్ను సంగతేంటి?ఒకవేళ ఆ ఫ్లాట్‌ని అమ్మితే వచ్చే మూలధన రాబడిపై పన్నులు వర్తిస్తాయా? ఇలాంటి సందేహాలు సహజం కదా! మరి ఈ వివరాలపై ఓ లుక్కేద్దాం!

సాధారణంగా బహుమానం ఇచ్చేవారు దాని విలువపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అసవరం ఉండదు. అయితే ఆ బహుమానాన్ని స్వీకరించే వారు మాత్రం కొన్ని సందర్భాల్లో ఆ విలువను తమ ఆదాయాల్లో కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒక ఏడాది కాలంలో అందుకున్న బహుమానాల విలువ రూ.50 వేలు దాటకపోతే దానిపై గ్రహీత ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ రూ.50 వేలు దాటితే మాత్రం కచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే. అయితే, ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. బహుమానం ఇచ్చిన వారు సమీప బంధువులైతే(తండ్రితో సహా) ఎలాంటి పరిమితి లేకుండా బహుమతి మొత్తం విలువపై పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే ఓ తండ్రి తన కూతురికి ఫ్లాట్‌ని గిఫ్ట్‌గా ఇస్తే ఎవరూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇక బహుమానం ద్వారా పొందిన ఆస్తిపై సంపాదించిన లేదా లభించే ఆదాయంపై గ్రహీత మేజర్‌ అయితే కచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే. అయితే, ఆ రాబడిని తండ్రి ఆదాయంతో కలిపితే క్లబ్బింగ్‌ నిబంధనలు వర్తిస్తాయి. అలాగే కుమార్తె మైనర్‌ అయినా క్లబ్బింగ్‌ నిబంధనలే వర్తిస్తాయి. తండ్రి ఆదాయంతో కలిపే రాబడిపై రూ.1,500 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక కూతురు మేజర్‌ అయి ఉండి, ఆ ఫ్లాట్‌ని అమ్మితే వచ్చే మూలధన లాభాలు పన్ను పరిధిలోకి వస్తాయి. ఒకవేళ మైనర్‌ అయితే మళ్లీ క్లబ్బింగ్‌ నిబంధనలు వర్తిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని