India economy: 4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌?

India economy: దేశ ఆర్థిక వ్యవస్థ మొదటి సారిగా 4 ట్రిలియన్‌ డాలర్ల మార్కుకు చేరిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర మంత్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Published : 19 Nov 2023 22:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ ఆర్థిక వ్యవస్థ మొదటి సారిగా 4 ట్రిలియన్‌ డాలర్ల మైలు రాయిని చేరిందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ‘ఎక్స్‌’ వేదికగా కేంద్ర మంత్రులు ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రముఖులు కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌ డేటా ఆధారంగా అన్ని దేశాలకు సంబంధించిన జీడీపీ లైవ్‌ ట్రాకింగ్‌ డేటా అంటూ ఓ స్క్రీన్‌గ్రాబ్ సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్‌ అవుతోంది. మొదటి సారిగా భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (GDP) 4 ట్రిలియన్‌ డాలర్లకు చేరిందంటూ పోస్టుల కూడా పెడుతున్నారు.  మోదీ నాయకత్వంలో ఈ మైలు రాయిని అధిగమించిందంటూ కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ‘ఎక్స్‌’ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy), ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు పలువురు రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

ముద్ర యోజనలో మహిళలకే ప్రాధాన్యం: నిర్మలా సీతారామన్‌

అయితే ఇలా భారత్‌ 4 ట్రిలియన్‌ డాలర్ల మైలు రాయిని దాటిందంటూ ప్రచురితమవుతున్న కథనాల్లో ఎటువంటి వాస్తవం లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇలా అన్ని దేశాల జీడీపీ గణాంకాలను ప్రత్యక్షంగా ట్రాక్ చేయడం చాలా కష్టం అని వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, జాతీయ గణాంక కార్యాలయం ధృవీకరించలేదు. ఇక.. 2030 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని