Inflation: ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో విజయం సాధిస్తాం: నిర్మలా సీతారామన్
ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా నిర్వహించడంలో భారత్ విజయం సాధిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తంచేశారు.
దిల్లీ: ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా అదుపు చేయడంలో భారత్ విజయం సాధిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తంచేశారు. ఆహార పదార్థాల ధరల అదుపునకు సరఫరా అవరోధాలను అధిగమించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న సౌకర్యవంత స్థాయికి ఎగువనే కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం కొనసాగుతున్న వేళ నిర్మలా సీతారామన్ ఓ సదస్సులో దీనిపై మాట్లాడారు. క్రూడాయిల్ వంటి దిగుమతుల వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో తాము తప్పకుండా విజయం సాధిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. వచ్చే ఏడాది మొదట్లో గానీ, వచ్చే ఏడాది మధ్య నాటికి ద్రవ్యోల్బణం దిగి వస్తుందని చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని అనేక కారణాలు ప్రభావితం చేస్తున్నాయని, దేశంలో మాత్రం పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. వచ్చే ఏడాదికి వృద్ధి పథంలో భారత్ దూసుకెళుతుందన్నారు.
ఈ సందర్భంగా రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతిపై వచ్చిన ప్రశ్నలపై ఆర్థిక మంత్రి స్పందించారు. పశ్చిమ దేశాల మాదిరిగానే భారత్ కూడా రష్యా చమురును కొనుగోలు చేస్తోందన్నారు. చౌక ధరకు చమురు దొరుకుతుండడమే ఇందుకు కారణమన్నారు. రష్యా చమురు ధరపై పరిమితి విధించాలని డిమాండ్ చేసేవారే ఇంకా ఎక్కువ చమురును ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నారని నిర్మలా సీతారామన్ అన్నారు. అందుబాటు ధరల్లో వస్తువులు అందరికీ ఉండాలని తాను కోరుకుంటానని, సరకులపై ఆంక్షలు విధిస్తే కొంతమందిపై ప్రభావం పడుతుందన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Rajasthan: పెట్రోల్ ట్యాంకర్లో మద్యం అక్రమ రవాణా..!
-
World News
Australia: డాల్ఫిన్లతో ఈతకని దిగి.. సొర చేపకు చిక్కి..!
-
Sports News
Gill: ‘శుభ్‌మన్.. నాగ్‌పుర్ ఏదో చెబుతోంది చూడు’’: ఉమేశ్ యాదవ్ ఫన్నీ ట్వీట్
-
World News
Wikipedia: పాక్‌లో వికీపీడియాపై నిషేధం.. స్పందించిన వికీమీడియా
-
General News
Rushikonda: బోడికొండకు కవరింగ్.. జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్
-
Sports News
IND vs AUS: స్టీవ్ స్మిత్‌ని ఆ స్పిన్నర్ ఇబ్బందిపెడతాడు: ఇర్ఫాన్ పఠాన్