Google Chrome: పాత క్రోమ్‌ వాడుతున్నారా? వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి..!

గూగుల్‌ క్రోమ్‌ పాత బ్రౌజర్‌ మీ సిస్టమ్‌లో వాడుతున్నారా? అయితే వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి. లేదంటే రిమోట్‌ ద్వారా మీ సిస్టమ్‌ను యాక్సెస్‌ నేరగాళ్లు యాక్సెస్‌ చేయొచ్చు.

Published : 31 Aug 2023 18:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాపులర్‌ వెబ్‌బ్రౌజర్‌ గూగుల్‌ క్రోమ్‌ (Google Chrome) యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. కంప్యూటర్లలో పాత క్రోమ్‌ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్‌ ఆఫ్ ఇండియా (CERT-IN) ‘తీవ్ర’ హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్‌ బ్రౌజర్‌లో లోపాల కారణంగా రిమోట్ యాక్సెస్‌ ద్వారా మీ కంప్యూటర్‌ యాక్సెస్‌ చేయడంతో పాటు అందులో సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని పేర్కొంది.

గూగుల్‌ క్రోమ్‌ విండోస్‌ వెర్షన్‌ 116.0.5845.110/.111, మ్యాక్‌, లైనక్స్‌ వెర్షన్‌ 116.0.5845.110 కంటే ముందు వెర్షన్ల బ్రౌజర్లను వినియోగిస్తున్న వారికి ముప్పు పొంచి ఉందని సెర్ట్‌-ఇన్‌ తెలిపింది. ఆయా బ్రౌజర్లలో లోపాల కారణంగా రిమోట్‌గా దాడి చేసే వ్యక్తి.. సిస్టమ్‌లోకి ఆర్బిడరీ కోడ్‌లను జొప్పించడం, సర్వీస్‌లను తిరస్కరించం (DoS), లక్షిత సిస్టమ్‌లలో ఉన్న సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేసే ప్రమాదం ఉందని సెర్ట్‌-ఇన్‌ తన హెచ్చరికల్లో పేర్కొంది. కాబట్టి వెంటనే గూగుల్‌ క్రోమ్‌ లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. 

ఫోన్‌ నంబర్‌ లేకుండానే.. ట్విటర్‌లో ఇక ఆడియో, వీడియో కాల్స్‌

ఏ వెర్షనో ఎలా తెలుసుకోవాలి?

ఒకవేళ మీరు గూగుల్‌ క్రోమ్‌ ఏ వెర్షన్‌ వాడుతున్నారో తెలుసుకోవాలంటే.. బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్‌ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తాయి. అందులో సెట్టింగ్స్‌ పేజీలో ఎడమవైపు ఓ జాబితా కనిపిస్తుంది. అందులో చివర్లో ‘అబౌట్‌ క్రోమ్‌’ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ బ్రౌజర్‌ ప్రస్తుత వెర్షన్‌తో పాటు అప్‌డేట్‌ అయిందా? లేదా?అనేది చూపిస్తుంది. ఒకవేళ బ్రౌజర్‌ అప్‌డేట్‌ కాకుంటే రీలాంచ్‌ చేసి అప్‌డేట్ చేయాలి. బ్రౌజర్‌ ఆటోమేటిగ్గా అప్‌డేట్ అయితే ‘క్రోమ్‌ ఈజ్‌ అప్‌ టూ డేట్‌’ అని చూపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని