Forex reserves: 3 వారాల తర్వాత గణనీయంగా పెరిగిన విదేశీ మారక నిల్వలు

జూన్‌ 24తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక నిల్వలు 2.734 బిలియన్‌ డాలర్లు పెరిగి 593.323 బిలియన్‌ డాలర్లకు చేరింది...

Published : 02 Jul 2022 14:00 IST

ముంబయి: జూన్‌ 24తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక నిల్వలు 2.734 బిలియన్‌ డాలర్లు పెరిగి 593.323 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. విదేశీ మారక నిల్వల్లో సింహ భాగమైన కరెన్సీ ఆస్తుల విలువ 2.334 బిలియన్‌ డాలర్లు పెరిగి 529.216 బిలియన్‌ డాలర్లకు చేరింది. తర్వాత బంగారం నిల్వలు 342 మిలియన్‌ డాలర్లు పెరిగి 40.926 బిలియన్‌ డాలర్లకు ఎగబాకాయి. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 55 మి.డాలర్లు ఎగబాకి 18.210 బి.డాలర్లకు, ఐఎంఎఫ్‌లో భారత రిజర్వు స్థాయి మూడు మిలియన్‌ డాలర్లు పెరిగి 4.970 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

జూన్‌ 17తో ముగిసిన వారంలో మారక నిల్వలు 5.87 బిలియన్‌ డాలర్లు తరిగి 590.588 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. ఆర్థిక మాంద్యం భయాలతో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు భారీ ఎత్తున పెట్టుబడులను భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవడమే దీనికి ప్రధాన కారణం. వరుసగా మూడు వారాల పాటు తగ్గుతూ వచ్చిన మారక నిల్వలు 10.785 బిలియన్‌ డాలర్లు తరిగాయి. కానీ, గతవారం మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని