Lava Blaze Pro 5G: ₹12వేలకే లావా 5జీ ఫోన్‌.. రిపేరైతే ఇంటికొచ్చి సర్వీస్‌!

Lava Blaze Pro 5G: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా లావా బ్లేజ్‌ ప్రో 5జీ పేరుతో మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేయండి.

Published : 26 Sep 2023 14:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా (Lava) కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఇటీవల లావా బ్లేజ్‌ 2 ప్రో (Lava Blaze 2 Pro)ను అందుబాటులోకి తెచ్చిన కంపెనీ.. ఇప్పుడు లావా బ్లేజ్‌ ప్రో 5జీ (Lava Blaze Pro 5G) పేరుతో మరో కొత్త మొబైల్‌ని విడుదల చేసింది. యూజర్లను ఆకట్టుకునే విధంగా బడ్జెట్‌ ధరలో ఈ ఫోన్‌ను తక్కువ ధరలోనే అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్‌తో పాటు ఇతర రిటైల్‌ స్టోర్లలో అక్టోబర్‌ 3 నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నాయని కంపెనీ ప్రకటించింది.

లావా బ్లేజ్‌ ప్రో 5జీ 8జీబీ+ 12జీబీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.12,499 గా కంపెనీ నిర్ణయించింది. స్టేరీ నైట్‌, రేడియంట్‌ పెరల్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. 6.78 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రీఫ్రెష్‌ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 5000mAh బ్యాటరీని ఇచ్చారు. ఇది 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కి సపోర్ట్‌ చేస్తుంది. ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరాను అమర్చారు.

2100 నాటికి అన్ని వ్యాధుల నిర్మూలనే లక్ష్యం : జుకర్‌బర్గ్‌ ఫౌండేషన్‌

ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌తో పనిచేస్తుంది. బ్లోట్‌ ఫ్రీ స్కిన్‌తో వస్తోంది. మీడియా టెక్‌ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. మెబైల్‌ ర్యామ్‌ను 16జీబీ వరకు మెమొరీ పెంచుకొనే సదుపాయం ఉంది. బ్లూటూత్‌ 5.0, యూఎస్‌బీ టైప్‌-C పోర్ట్‌, 3.5mm హెడ్‌ఫోన్‌ ఇందులో ఉన్నాయి. దీంతో పాటు ‘ఫ్రీ సర్వీస్‌ ఎట్‌ హోమ్‌’ కార్యక్రమాన్ని కూడా లావా లాంచ్‌ చేసింది. అంటే వారెంటీ సమయం మగిసేలోగా ఫోన్‌లో ఏదైనా సమస్య తలెత్తితే సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లాల్సిన పని లేకుండా నేరుగా ఇంటికే వచ్చి సర్వీస్‌ను అందించే సదుపాయాన్ని తీసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు