LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ దరఖాస్తుకు మరికొన్ని గంటలే..!

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) దరఖాస్తుకు మరికొన్ని గంటల్లో గడువు ముగియనుంది....

Updated : 09 May 2022 13:30 IST

దిల్లీ:  లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) దరఖాస్తుకు మరికొన్ని గంటల్లో గడువు ముగియనుంది. మే 4న ప్రారంభమైన ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు మొత్తంగా 2.05 రెట్ల స్పందన లభించింది. ఎల్‌ఐసీ 16.20 కోట్ల షేర్లను పబ్లిక్‌ ఇష్యూకు కేటాయించగా.. 33.15 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలైనట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల గణాంకాల ద్వారా తెలుస్తోంది.

అర్హులైన సంస్థాగత మదుపర్ల (QIB) విభాగంలో 1.17 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగతేతర మదుపర్ల (NII) విభాగంలో 1.39 రెట్ల షేర్లకు, పాలసీదారుల కేటగిరీలో 5.38 రెట్లకు, రిటైల్‌ వ్యక్తిగత మదుపర్ల (Retail Investors) విభాగంలో 7.72 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఉద్యోగుల విభాగంలో 4.01 రెట్ల స్పందన లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని