Ola: పార్సిల్‌ డెలివరీ సేవల్లోకి ఓలా.. తొలుత ఈ నగరంలో..!

Ola: ఇప్పటి వరకు రైడ్‌ సేవలకే పరిమితమైన క్యాబ్‌ బుకింగ్‌ సేవల సంస్థ ఓలా తాజాగా పార్సిల్‌ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టింది.

Updated : 07 Oct 2023 20:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ క్యాబ్ బుకింగ్‌ సేవల సంస్థ ఓలా (Ola) తాజాగా పార్సిల్‌ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు రైడ్‌ సేవల్ని మాత్రమే అందిస్తున్న సంస్థ ఇకపై డెలివరీలు అందించేందుకు సిద్ధమైంది. ‘ఓలా పార్సిల్‌’ పేరిట డెలివరీ సేవల్ని ప్రారంభించింది. బెంగళూరు వాసులకు ఈ సేవల్ని మొదటగా పరిచయం చేసింది.

ఎయిరిండియా విమానాల నయా లుక్‌.. ఫొటోలు వైరల్‌

‘బెంగళూరులో ‘ఓలా పార్సిల్‌’ను ప్రారంభించాం.  ఈ  సేవల్ని అందించటం కోసం ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను మాత్రమే ఉపయోగిస్తాం’ అని  ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) తన అధికారిక ‘ఎక్స్‌’ ద్వారా ప్రకటించారు. 5 కిలోమీటర్ల లోపు దూరానికి రూ.25.. 15 కిలోమీటర్ల దూరానికి రూ.75.. అలాగే 20 కిలోమీటర్ల దూరానికి రూ.100 ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు నగరమంతా ఈ పార్సిల్‌ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఓలా తెలిపింది. రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా అన్ని నగరాలకు ఈ సేవల్ని విస్తృతం చేయనున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని