Olectra truck: ఒలెక్ట్రా నుంచి హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్‌ ట్రక్స్‌.. ట్రయల్స్‌ షురూ

ఎలక్ట్రిక్‌ బస్సుల తయారుచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌ లిమిటెడ్‌ మరో ముందడుగు వేసింది. త్వరలోనే ఎలక్ట్రిక్‌ టిప్పర్‌ను తీసుకురానుంది.

Published : 15 Apr 2022 19:55 IST

దిల్లీ: ఎలక్ట్రిక్‌ బస్సుల తయారు చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌ లిమిటెడ్‌ మరో ముందడుగు వేసింది. త్వరలోనే ఎలక్ట్రిక్‌ టిప్పర్‌ను తీసుకురానుంది. దీనికి సంబంధించి ట్రయల్స్‌ మొదలయ్యాయి. 6×4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్‌ ట్రక్‌ సింగిల్‌ ఛార్జ్‌తో 220 కిలోమీటర్ల ప్రయాణించగలదు. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ బస్సు తయారీలో మార్కెట్‌ లీడర్‌గా ఉన్నామని, ఈ ట్రక్‌ ద్వారా ఎలక్ట్రిక్‌ టిప్పర్‌ విభాగంలోకి అడుగు పెడుతున్నామని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే హైదరాబాద్‌ శివార్లలో వీటి తయారీని ప్రారంభించనున్నట్లు తెలిపింది.

భారత్‌లోనే తొలి ఎలక్ట్రిక్‌ను తాము తీసుకొస్తున్నామని కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీ ప్రదీప్‌ ఈ సందర్భంగా తెలిపారు. శిలాజ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో ఈ విభాగంలో ఎలక్ట్రిక్‌ ట్రక్‌ పెనుమార్పులు తీసుకురాబోతోందని చెప్పారు. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ను మేఘ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (MEIL) 2000 సంవత్సరంలో ప్రారంభించింది. 2015లో తొలి బస్సును ఈ కంపెనీ విడుదల చేసింది. పలు నగరాల్లో ఈ బస్సులు పరుగులు తీస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని