OnePlus: ఈ వన్‌ప్లస్‌ ఫోన్‌ కొన్నవారికి రూ.2,199 విలువైన ఇయర్‌బడ్స్‌ ఫ్రీ!

OnePlus: తమ ఫోన్ల విక్రయాలను పెంచుకునే వ్యూహంలో భాగంగా వన్‌ప్లస్‌ వినియోగదారుల కోసం ఓ ఆఫర్‌ను ప్రకటించింది. ఓ ఫోన్‌ కొన్నివారికి ఉచితంగా ఇయర్‌బడ్స్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

Published : 15 Sep 2023 15:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ నార్డ్‌ 3 5జీ (OnePlus Nord 3 5G) ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ (Nord Buds 2R)ను ఉచితంగా ఇవ్వనున్నట్లు వన్‌ప్లస్‌ ప్రకటించింది. ఈ ఫోన్‌ ఈ ఏడాది జులైలో విడుదలైంది. అదే సమయంలో వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 5జీ ఫోన్‌, వనప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ (Nord Buds 2R) కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ బడ్స్‌ కంపెనీ అందిస్తున్న ఎంట్రీ- లెవెల్‌ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌. ఛార్జింగ్‌ కేస్‌తో కలిపి ఈ బడ్స్‌ బ్యాటరీ లైఫ్‌ 40 గంటల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌, అధికారిక వన్‌ప్లస్‌ స్టోర్‌ నుంచి నార్డ్‌ 3 5జీ ఫోన్‌ను కొనుగోలు చేసినవారికి మాత్రమే నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ (Nord Buds 2R)ను ఉచితంగా ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఫోన్‌ రెండు రంగులు, రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో భారత్‌లో అందుబాటులో ఉంది. 8GB + 128GB ధర రూ.33,999. 16GB + 256GB ధర 37,999. ఈ రెండు వేరియంట్లపైనా ఉచిత ఇయర్‌బడ్స్‌ లభిస్తాయి. ప్రస్తుతం వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ ధర భారత్‌లో రూ.2,199. డీప్‌ గ్రే, ట్రిపుల్‌ బ్లూ రంగుల్లో లభిస్తోంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ ఫీచర్లు (Nord Buds 2R Features)..

వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ (Nord Buds 2R)లో 12.4mm డైనమిక్‌ డ్రైవర్స్‌, ఒక్కో బడ్‌లో 36mAh బ్యాటరీని పొందుపర్చారు. చార్జింగ్‌ కేస్‌ లేకుండా ఎనిమిది గంటల బ్యాటరీ లైఫ్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది. చార్జింగ్‌ కేస్‌లో 480mAh బ్యాటరీని ఇస్తున్నట్లు పేర్కొంది. దీనితో బ్యాటరీ లైఫ్‌ మరో 36 గంటలు పెరుగుతుందని తెలిపింది. డాల్బీ అట్మోస్‌ సపోర్ట్‌తో వస్తున్న ఈ బడ్స్‌లో బ్లూటూత్‌ 5.3, యూఎస్‌బీ టైప్‌-సి ఉన్నాయి. 

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ ఫోన్‌ ఫీచర్లు (OnePlus Nord 3 5G Features)..

మరోవైపు వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ (OnePlus Nord 3 5G) ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9,000 ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌13తో వస్తోంది. 120Hz రీఫ్రెస్‌ రేట్‌ ఉన్న 6.74 అమోలెడ్‌ తెరను పొందుపర్చారు. 50MP సామర్థ్యంతో కూడిన ప్రధాన కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా ఉంది. 80W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అమర్చారు. 5G, 4G LTE, వైఫై 6, బ్లూటూత్‌ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని