OnePlus Nord CE 3 lite: ₹20 వేలకే వన్‌ప్లస్‌ 5జీ ఫోన్‌.. 108 MP కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌!

OnePlus Nord CE 3 lite Full details: వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌ లాంచ్‌ చేసింది. నార్డ్‌ సీఈ 2 లైట్‌కు కొనసాగింపుగా నార్డ్‌ సీఈ3 లైట్‌ను తీసుకొచ్చింది.

Published : 05 Apr 2023 02:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ (OnePlus) భారత మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. నార్డ్‌ సీఈ2 లైట్‌కు కొనసాగింపుగా నార్డ్‌ సీఈ 3 లైట్‌ను (OnePlus Nord CE 3 lite) విడుదల చేసింది. రూ.20వేల్లోపు ధరకే 5జీ, 108 ఎంపీ కెమెరా, 67 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఇస్తోంది. దీంతో పాటు కొత్త బడ్స్‌నూ వన్‌ప్లస్‌ విడుదల చేసింది.

వన్‌ప్లస్‌ సీఈ3 లైట్‌ (OnePlus Nord CE 3 lite) రెండు వేరియంట్లలో వస్తోంది. 8జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+254 జీబీ వేరియంట్‌ ధరను రూ.21,999గా పేర్కొంది. పాస్టల్‌ లైమ్‌, క్రోమాటిక్‌ గ్రే రంగుల్లో ఈ ఫోన్‌ దొరుకుతుంది. ఏప్రిల్‌ 11 నుంచి వన్‌ప్లస్‌ ఆన్‌లైన్‌ స్టో్ర్లు, అమెజాన్‌ ఇండియా, రిటైల్‌ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

ఇక స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళితే ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 13.1తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 6.72 ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 120Hz డైనమిక్‌ రీఫ్రెష్‌ రేట్‌తో వస్తోంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌ను అమర్చారు. వర్చువల్‌గా ర్యామ్‌ను 8జీబీ వరకు పెంచుకోవచ్చు. ఫొటోలు, వీడియోల కోసం వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. ఇందులో 108 మెగాపిక్సల్ శాంసంగ్‌ HM6 సెన్సర్‌ను అమర్చారు. 2ఎంపీ మ్యాక్రో కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ అమర్చారు. ముందువైపు 16 ఎంపీ కెఎరా ఇచ్చారు. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై, 3.5 ఎంఎం జాక్‌, బ్లూటూత్‌ 5.1, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ ఉన్నాయి. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లతో పాటు, నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సదుపాయం ఉంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67W సూపర్‌ వూక్‌ వైర్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. కేవలం 0-80% బ్యాటరీని 30 నిమిషాల్లో ఛార్జ్‌ చేయొచ్చని కంపెనీ పేర్కొంది.

నార్డ్‌ బడ్స్‌@ ₹9999

స్మార్ట్‌ఫోన్‌తో పాటు వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2 ఇయర్‌ బడ్స్‌ను సైతం ఆ కంపెనీ విడుదల చేసింది. దీని దరను రూ.9999గా పేర్కొంది. నాలుగు రంగుల్లో లభ్యమయ్యే ఈ బడ్స్ ఏప్రిల్‌ 4 నుంచి విక్రయానికి ఉంచనున్నారు. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 5 గంటల వరకు వీటిని వినియోగించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని