వాహన బీమా లో ఐఆర్డీఏ మరో సదుపాయం

వాహన బీమా కి సంబంధించి ఐఆర్డీఏ ఒక ముఖ్యమైన మార్పును సూచించింది

Published : 27 Dec 2020 20:10 IST

వాహన బీమా కొనుగోలుదారులకు ఐఆర్డీఏ మరో సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు వీరు థర్డ్ పార్టీ బీమా తో కలిపి ఓన్ డ్యామేజ్ (ఓడీ) కవర్ కొనుగోలు చేయాల్సి వచ్చేది. సెప్టెంబర్ 1 నుంచి ఓడీ ని విడి కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇది కార్లు, ద్విచక్ర వాహనాలకు కూడా వర్తిస్తుంది. దీనితో పాటు ఓడీ కవర్ ని కొద్దీ రోజులు ఆగి కొనుగోలు చేయవచ్చు, అలాగే మరో బీమా కంపెనీ వద్ద కూడా ఈ కవర్ ని కొనుగోలు చేసే వీలుంటుంది.

థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. ఈ బీమా ఉన్న వారు మాత్రమే ఓడీ కవర్ తీసుకోగలరు. పాలసీ దారుడు కొత్త కారు కొనుగోలు చేసినప్పుడు థర్డ్ పార్టీ బీమా మాత్రమే తీసుకుని సొంతంగా ఓడీ కొనుగోలు చేయవచ్చు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని