పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నికర లాభం రూ.1756 కోట్లు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Published : 26 Oct 2023 17:15 IST

దిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.1,756 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.411.30 కోట్లు మాత్రమే. నికర లాభంలో 327% వృద్ధిని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం (NII) 20% పెరిగి రూ.9,923 కోట్లకు చేరింది. ఇది క్రితం సంవత్సరం రూ.8,270.70 కోట్లు. స్థూల ఎన్‌పీఏలు 7.73 శాతం నుంచి 6.96 శాతానికి తగ్గాయి. ఈ త్రైమాసికంలో బ్యాంకు మొత్తం డిపాజిట్లు రూ.4,71,238 కోట్లకు చేరాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు 10,092 దేశీయ శాఖలు, 2 అంతర్జాతీయ శాఖలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని