3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం

ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)లు మార్కెట్‌లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండీజీన్‌, టీబీఓ టెక్‌ ఐపీఓలు వస్తున్నాయి.

Published : 06 May 2024 02:19 IST

దిల్లీ: ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)లు మార్కెట్‌లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండీజీన్‌, టీబీఓ టెక్‌ ఐపీఓలు వస్తున్నాయి.

ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌: బ్లాక్‌స్టోన్‌ పెట్టుబడులు కలిగిన ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిగా రూ.300- 315 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ  రూ.3000 కోట్లు సమీకరించనుంది. రిటైల్‌ మదుపర్లు 47 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇండీజీన్‌: ఆరోగ్య సంరక్షణ టెక్‌ సంస్థ ఇండీజీన్‌ ఐపీఓ ఈ నెల 6న (నేడు) ప్రారంభమై 8న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.430- 452 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.1,842 కోట్లు సమీకరించనుంది. రిటైల్‌ మదుపర్లు కనీసం 33 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.

టీబీఓ టెక్‌: ట్రావెల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ టీబీఓ టెక్‌ ఐపీఓ మే 8న ప్రారంభమై 10న ముగియనుంది. ధరల శ్రేణిగా రూ.875- 920 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ  రూ.1,551 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రిటైల్‌ మదుపర్లు కనీసం 16 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  • 2004 నుంచి చూస్తే.. గత నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగిన మే నెలల్లో ఒక్క ఐపీఓ కూడా మార్కెట్‌ ముందుకు రాలేదు. ఈ సారి అందుకు భిన్నంగా ఐపీఓలు వస్తున్నాయి.
  • ఐపీఓ ద్వారా రూ.1300 కోట్లు సమీకరించేందుకు ముత్తూట్‌ ఫైనాన్స్‌ అనుబంధ సంస్థ బెల్‌స్టార్‌ మైక్రోఫైనాన్స్‌ ఆదివారం సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని