గృహ రుణ బకాయిలు పెరిగాయ్‌: ఆర్‌బీఐ

గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.

Published : 06 May 2024 02:06 IST

దిల్లీ: గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది. 2022 మార్చి నాటికి రూ.17,26,697 కోట్ల బకాయిలు ఉండగా, 2023 మార్చి నాటికి రూ.19,88,532 కోట్లకు, 2024 మార్చి నాటికి రూ.27,22,720 కోట్లకు చేరాయని పేర్కొంది. వాణిజ్య స్థిరాస్తి రుణ బకాయిలు 2024 మార్చి నాటికి రూ.4,48,145 కోట్లకు చేరాయని, 2022 మార్చిలో రూ.2,97,231 కోట్లుగా ఉన్నాయని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని