పసిడిలో లాభాల స్వీకరణ!

పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్‌ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు.

Published : 06 May 2024 02:13 IST

కమొడిటీస్‌
ఈ వారం

పసిడి,వెండి

సిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్‌ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. ఒకవేళ రూ.69,334 స్థాయి దిగువన కదలాడితే రూ.69,200; రూ.68,318 వరకు తగ్గొచ్చు. సానుకూలంగా కదలాడితే 71,550; రూ.72,432; రూ.73,166 వరకు రాణించే అవకాశం ఉంటుంది. వెండి జూన్‌ కాంట్రాక్టు ఈవారం రూ.82,397 కంటే పైకి వెళితే రూ.83,751 వరకు వెళ్లొచ్చు. అయితే ప్రతికూల ధోరణిలో కదలాడితే రూ.79,982 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.78,921కు దిగి వచ్చే అవకాశం ఉంటుంది.


ప్రాథమిక లోహాలు

  • రాగి మే కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.868.85 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. దీనిని అధిగమిస్తే రూ.882.40 వరకు రాణించవచ్చు. ఒకవేళ రూ.842.55 కంటే దిగున కదలాడితే రూ.829.80 వరకు దిద్దుబాటు అవుతుందని భావించవచ్చు.
  • సీసం మే కాంట్రాక్టు ఈ వారం రూ.194.70 కంటే పైన చలించకుంటే దిద్దుబాటు ఆస్కారం ఉండే అవకాశం ఉంటుంది. రూ.192.45 వద్ద నిరోధం, 190.20 వద్ద మద్దతు లభించొచ్చు..
  • జింక్‌ మే కాంట్రాక్టు ఈ వారం రూ.252.85 కంటే దిగువన కదలాడితే మరింతగా కిందకు రావచ్చు.
  • అల్యూమినియం మే కాంట్రాక్టుకు ఈ వారం రూ.228.35 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.223.45కు పడిపోవచ్చు.

ఇంధన రంగం

  • ముడి చమురు మే కాంట్రాక్టుకు ఈ వారం సానుకూల ధోరణి కొనసాగితే రూ.7,162,   రూ.7,319 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రూ.6,389 కంటే దిగువన కదలాడితే రూ.6,232; రూ.5,924 వరకు దిద్దుబాటు కావచ్చు
  • సహజవాయువు మే కాంట్రాక్టు ఈవారం రూ.166 కంటే దిగువన చలించకుంటే.. మరింతగా రాణిస్తుందని భావించవచ్చు.రూ.186.15 వద్ద నిరోధం ఎదురవుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

వ్యవసాయ ఉత్పత్తులు

సుపు జూన్‌ కాంట్రాక్టుకు ఈవారం రూ.18,498 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.18,145; రూ.17,650కు పడిపోవచ్చు. అదేవిధంగా సానుకూల ధోరణిలో కదలాడితే రూ.19,346 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.19,841; రూ.20,194 వరకు పెరుగుతుందని భావించవచ్చు.

పత్తి క్యాండీ మే కాంట్రాక్టు ఈవారం రూ.56,840 కంటే కిందకు వస్తే   రూ.56,020 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ రూ.58,640 స్థాయిని మించితే రూ.59,620 వరకు రాణించే అవకాశం ఉంటుంది.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని