పురుగు మందుల అవశేషాలపై భారత్‌లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం

ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్‌ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది.

Published : 06 May 2024 02:06 IST

దిల్లీ: ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్‌ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. మసాలాలు, మూలికల్లో అధిక స్థాయి అవశేషాలను ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతిస్తోందని సూచించే నివేదికలను తోసిపుచ్చింది. రెండు ప్రముఖ భారతీయ బ్రాండ్లు ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ల నమూనాల్లో పురుగు మందు ఇథిలీన్‌ ఆక్సైడ్‌ ఉన్నట్లు ఆరోపిస్తూ హాంకాంగ్‌ ఆహార నియంత్రణ సంస్థ నిషేధం విధించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ స్పష్టత ఇచ్చింది. సింగపూర్‌ ఆహార నియంత్రణ సంస్థ కూడా ఎవరెస్ట్‌ బ్రాండ్‌కు చెందిన ఒక మసాలా ఉత్పత్తిని రీకాల్‌ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని