Amazon primeday sale: ప్రైమ్‌ యూజర్లూ అలర్ట్‌.. ప్రైమ్‌ డే సేల్ ఈ సారి ముందుగానే!

Amazon primeday sale: అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్ ఈ సారి ముందుగానే నిర్వహించాలని అమెజాన్‌ నిర్ణయించింది.

Published : 04 Jul 2022 14:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్ (Amazon primeday sale).. తరచూ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వారికి పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లు ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లతో వస్తువులను కొనుగోలు చేయొచ్చు. భారత్‌లో సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో ప్రారంభమయ్యే పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఏటా ఆగస్టులో ఈ సేల్‌ను నిర్వహిస్తోంది అమెజాన్‌. కానీ, ఈ సారి ముందుగానే నిర్వహించాలని నిర్ణయించింది.

అమెరికా, యూరప్‌ సహా పలు దేశాల్లో జులై 12-13 తేదీల్లో అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ నిర్వహించేందుకు అమెజాన్‌ సిద్ధమైంది. ఆ తర్వాత సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఈజిప్ట్‌లో కూడా ఈ సేల్‌ జరగనుంది. వీటికి సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదు. అయితే, ఈ దేశాలతో పాటే భారత్‌లోనూ సేల్‌ నిర్వహించనున్నామని ఇంతకుముందు అమెజాన్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జులైలోనే అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ జరగనుందని తెలుస్తోంది.

మరోవైపు ఈ సేల్‌కు సిద్ధమవ్వాలని సెల్లర్లకు ఇప్పటికే అమెజాన్‌ ఈ-మెయిల్స్‌ పంపుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సేల్‌లో పాల్గొనేందుకు స్టాక్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించింది. జులై 21 నుంచి ఈ సేల్‌ జరిగే అవకాశం ఉందని భోగట్టా. త్వరలోనే ఈ తేదీపై ఓ స్పష్టత రానుంది. ఈ సేల్‌లో ఏయే వస్తువులను ఉంచుతున్నారు? ఎంత డిస్కౌంట్‌ లభించనుంది? ఏ కార్డుపై ఆఫర్లు ఉంటాయి? వంటివి తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాబట్టి ప్రైమ్‌ యూజర్లు ఈ సేల్‌పై ఓ కన్నేసి ఉంచండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని