Rasna founder: రస్నా వ్యవస్థాపకుడు అరీజ్‌ పిరోజ్‌షా కన్నుమూత

బహుళ జాతి కంపెనీలకు గట్టి పోటీనిస్తూ.. దేశీయ సాఫ్ట్‌ డ్రింక్‌ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన రస్నా బ్రాండ్‌ వ్యవస్థాపకుడు అరీజ్‌ పిరోజ్‌షా కంబట్టా (85)  కన్నుమూశారు.

Published : 21 Nov 2022 16:15 IST

దిల్లీ: బహుళ జాతి కంపెనీలకు గట్టి పోటీనిస్తూ.. దేశీయ సాఫ్ట్‌ డ్రింక్‌ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన రస్నా బ్రాండ్‌ వ్యవస్థాపకుడు అరీజ్‌ పిరోజ్‌షా కంబట్టా (85)  కన్నుమూశారు. ‘ఐ లవ్‌ యూ రస్నా’ ప్రకటన ద్వారా ఈ బ్రాండ్‌ బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ కంపెనీ ఛైర్మన్‌గా ఉన్న అరీజ్‌ పిరోజ్‌ శనివారం తుదిశ్వాస విడిచారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. బెనోవోలెంట్‌ ట్రస్ట్‌, రస్నా ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా, ప్రపంచ పార్సి ఇరానీ జొరాస్టిస్‌ మాజీ ఛైర్మన్‌గానూ ఆయన వ్యవహరించారు.

దేశీయంగా రస్నా బ్రాండ్‌ అంటే తెలియని వారు ఉండరు. అంతగా ప్రాచుర్యం పొందిన ఈ బ్రాండ్‌ను దాదాపు 60 దేశాల్లో ఇప్పుడు విక్రయిస్తున్నారు. ఎన్ని బహుళ జాతి కంపెనీలు వచ్చినప్పటికీ ఈ విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా రస్నా ఉంటూ వస్తోంది. సాఫ్ట్‌ డ్రింక్‌ ఖరీదుగా మారిన కాలంలో రస్నా ప్యాకెట్లను తీసుకొచ్చి కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు అరీజ్‌ పిరోజ్‌షా. కేవలం రూ.5 ప్యాకెట్‌తో 32 గ్లాసుల డ్రింక్‌ను తయారుచేసుకునేలా తీర్చిదిద్దారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని