Salary Hike: 2022లో జీతాలు స‌గ‌టున 9.4% పెర‌గొచ్చు..

నిరంత‌ర విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌తో అధిక పెట్టుబ‌డిదారుల విశ్వాసం దేశంలోకి ప్ర‌వ‌హిస్తోంది.

Updated : 22 Aug 2022 16:58 IST

వ‌చ్చే ఏడాది వివిధ రంగాల ఉద్యోగుల జీతాలు స‌గ‌టున 9.4% పెర‌గ‌వ‌చ్చ‌ని `అయాన్` క‌న్స‌ల్టింగ్ సంస్థ స‌ర్వే తెలిపింది. స్తిరాస్థి వంటి రంగం కూడా 2021లో 6.2% జీతాల పెంపుతో పోలిస్తే 2022లో 8.8% జీతాలు పెంచాల‌ని భావిస్తోంది. 2018లో స‌గ‌టు పెరుగుద‌ల 9.5% ఉంద‌ని `అయాన్ స‌ర్వే` అంచ‌నా వేసింది. గ‌తంలో 2 అంకెల స్థాయిలో వేత‌నాలు పెరిగినా, 2017 ఆ త‌ర్వాత భార‌త్‌లో స‌గ‌టు ఇంక్రిమెంట్ గ‌ణాంకాలు 9.3% క‌న్నా త‌క్కువ‌కి చేరాయి.

ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల్లో ఆన్‌లైన్ డిజిట‌ల్ సేవ‌లు పెరిగాయి. ఈ డిజిట‌ల్ స‌ర్వీసుల్లో ప‌నిచేసే ప్ర‌తిభావంతులకు డిమాండ్ పెరిగింది. దీని మూలంగా జీతాల బ‌డ్జెట్ పెరుగుతుంద‌ని స‌ర్వే తెలిపింది. అయాన్ స‌ర్వే ప్ర‌కారం, 2022 వేత‌నాల పెంపు ఆర్ధిక పున‌రుద్ధ‌ర‌ణ‌, మెరుగైన వినియోగ‌దారుల సెంటిమెంట్‌, ప్ర‌తిభావంతుల ఉద్యోగ నైపుణ్యాన్ని సూచిస్తుంది. 2021 కీల‌క‌మైన నిపుణుల డిమాండ్‌ను చూసింది.  ఆర్ధిక వ్య‌వ‌స్థ క్ర‌మంగా తెర‌వ‌బ‌డింది, కంపెనీలు కోవిడ్ సెకండ్ వేవ్‌ని ఎదుర్కొని మంచి వృద్ధిని న‌మోదుచేయ‌డానికి స్థితిస్థాప‌కంగా మారాయి. కంపెనీలు త‌మ సంస్థ‌ల‌లో స‌గ‌టు వేత‌న పెంపుకంటే ఇంకా ఎక్కువ మంచి పెర్పార్మ‌ర్‌ల‌కు జీతాలు చెల్లించాల‌నే త‌మ కోరిక‌ను సూచించాయ‌ని స‌ర్వే తెలిపింది.

2021లో 10.5%తో పోలిస్తే 2022లో స‌గ‌టున 11.2% పెంపుతో సాంకేతిక రంగం అత్యుత్త‌మ చెల్లింపుదారుగా కొన‌సాగుతోంది. త‌ర్వాత ప్రొఫెష‌న‌ల్ స‌ర్వీసులు, ఇ-కామ‌ర్స్ సంస్థ‌లు 10.1% వేత‌న పెంపును ఇస్తాయ‌ని భావిస్తున్నారు. గ‌తం లాగానే ఐటీ, లైఫ్ సైన్సెస్‌, ఫార్మా, క‌న్స్యూమ‌ర్ గూడ్స్ రంగాలు 9.2-9.6% వేత‌నాల పెంపును అందించ‌బోతున్నాయి. 2020లో వెనుక‌బ‌డిన రియ‌ల్ ఎస్టేట్‌, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ వంటి వారు కూడా 8.8 పెంపును అంచ‌నా వేస్తున్నారు. అదేవిధంగా గ‌త 18 నెల‌ల్లో కోవిడ్‌తో దెబ్బ‌తిన్న ఆతిథ్య‌, రెస్టారెంట్ రంగం 7.9% పెంపును అందించ‌నుంది. ఎన‌ర్జీ, ఇంజ‌నీరింగ్ డిజైన్ సేవ‌లు వంటి కీల‌క రంగాలు కూడా 7.7% వేత‌నాల పెంపును అందిస్తాయ‌ని స‌ర్వే తెలిపింది. ఇంధ‌న రంగం 7.7% పెంపుద‌ల ఉంటుంద‌ని తెలిపింది.

కోవిడ్ మ‌హ‌మ్మారి భార‌త్‌ను బ‌లంగా తాకిన‌ప్ప‌టికి భార‌తీయ సంస్థ‌లు క్లిష్ట స‌మ‌యాల‌లో దృఢ‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాయ‌ని అయాన్ స‌ర్వే తెలిపింది. భార‌త్‌లో ఇంకా కోవిడ్ ప్ర‌మాదం కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ వ్యాపార సెంటిమెంట్‌, 2022 కోసం జీతాల అంచ‌నాలతో య‌జ‌మానులు వ్యాపార వృద్ధి కోసం నిర్మిస్తున్నాయ‌ని స‌ర్వే తెలిపింది. అయితే అన్ని రంగాల‌లో వ్యాపార వృద్ధి సానుకూల ప‌రిణామాలు ఉండ‌టం విశేషం. 2020-21 కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా కొన్ని రంగాలు ఒత్తిడికి గుర‌వుతున్న సంవ‌త్స‌రం అయితే, చాలా వ్యాపారాలు 2022లోకి ఆశావాద దృష్టిని క‌లిగి ఉండ‌ట‌మే కాకుండా అధిక జీతాల పెరుగుద‌ల‌ను అంచ‌నా వేస్తున్నాయి. అయాన్ స‌ర్వే కూడా చాలా రంగాల‌లో సానుకూల సెంటిమెంట్‌నే చూసింది. నిరంత‌ర విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌తో అధిక పెట్టుబ‌డిదారుల విశ్వాసం దేశంలోకి ప్ర‌వ‌హిస్తోంది. చాలా విభాగాల‌లో వినియోగదారుల డిమాండ్ పెరుగుతుంద‌ని స‌ర్వే నివేదిక తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని