Samsung: ఈ పాత ఫోన్లు ఉన్నవారికి శాంసంగ్ స్పెషల్‌ ఆఫర్‌

Samsung Loyalty Programme: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ ‘Upgrade to Awesome’ పేరుతో ఒక లాయల్టీ ప్రోగ్రామ్‌ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తన ఏ సిరీస్‌ ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్లు ఇస్తోంది.

Published : 01 Nov 2023 01:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మీరు శాంసంగ్‌ పాత ఫోన్‌ వాడుతున్నారా? 5జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్‌ కావాలనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్‌ న్యూస్‌. భారత్‌లోని శాంసంగ్‌ కస్టమర్ల కోసం ‘అప్‌గ్రేడ్‌ టు ఆసమ్‌’ (Upgrade to Awesome) పేరుతో ఓ లాయల్టీ అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా A సిరీస్ 5జీ ఫోన్లపై డిస్కౌంట్‌ అందిస్తోంది. దాంతో పాటూ ఎటువంటి ఖర్చు లేకుండా శాంసంగ్‌ కేర్‌ ప్రొటెక్షన్‌ ప్లస్‌ స్క్రీన్‌ పొటెక్షన్‌ ప్యాక్‌ ఇస్తోంది. పాత శాంసంగ్‌ యూజర్లు సులువుగా 5జీ స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్‌ అవ్వటం కోసమే ఈ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చినట్లు శాంసంగ్‌ తెలిపింది. వడ్డీ లేని ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

ఏ ఫోన్లపై?

అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా 2020 కంటే ముందున్న ఏ సిరీస్‌, జే సిరీస్‌ ఫోన్లను కొత్త ఫోన్లతో ఎక్స్ఛేంజ్‌ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా గెలాక్సీ ఏ14 4జీబీ+64 జీబీ వేరియంట్‌ ధర రూ.18,449కాగా..  రూ.14,499కే ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది. రూ.973 నుంచి ఈఎంఐ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. శాంసంగ్‌ గెలాక్సీ ఏ23 5జీ 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ.28,990 ఉండగా.. రూ.18,999కే కొనుగోలు చేయొచ్చని కంపెనీ పేర్కొంది. ఈఎంఐ ఆప్షన్స్‌ రూ.1,407 నుంచి ప్రారంభం అవుతాయి.

5జీ ప్లాన్‌ ధరలు పెరగనున్నాయా? జియో క్లారిటీ

శాంసంగ్‌ ఏ సిరీస్‌లో ఏ34 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.35,499 కాగా.. ప్రస్తుతం రూ.25,999కే విక్రయించనున్నట్లు శాంసంగ్‌ తెలిపింది. అలాగే శాంసంగ్‌ ఏ54 5జీ 8జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.41,999 కాగా.. అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా శాంసంగ్‌ కస్టమర్లకు రూ.33,999కే విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. రూ.1,883 నుంచి ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. పైన పేర్కొన్న ఏ సిరీస్‌ ఫోన్లన్నీ ఆండ్రాయిడ్‌ 13తో పనిచేస్తాయి. 5000 mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి.

ఎలా..?

2020 కంటే ముందున్న పాత శాంసంగ్‌ మొబైల్స్‌ని ఈ అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా మార్చుకోవచ్చు. మై గెలాక్సీ యాప్‌లో అర్హులైన వారికి ఈ బ్యానర్‌ కనిపిస్తుంది. ఇందుకోసం శాంసంగ్‌ కస్టమర్లు తమ పాత గెలాక్సీ ఫోన్‌లోని ‘మై గెలాక్సీ’ యాప్‌లో కోడ్‌ జనరేట్‌ చేసుకోవాలి. ఫోన్‌ కొన్నాక కొత్త మొబైల్‌లో ఆ కోడ్‌ వివరాలు ఎంటర్ చేసి వ్యాలిడేట్‌ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడేట్‌ అనంతరం 48 గంటల్లో కస్టమర్‌ కేర్‌+ ప్యాక్‌ యాక్టివేట్‌ అవుతుంది. ఈ స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ ప్యాక్‌ ఆరు నెలల పాటు ఉచితంగా శాంసంగ్‌ అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని