SBI Fixed Deposits: భారీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీరేట్ల పెంపు

దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ (SBI) ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (Fixed Deposists) వడ్డీరేట్లను పెంచింది....

Updated : 10 May 2022 20:55 IST

ముంబయి: దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ (SBI) ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (Fixed Deposists) వడ్డీరేట్లను సవరించింది. రూ.2 కోట్లు ఆపైన చేసే డిపాజిట్లకు వడ్డీరేటును 40-90 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. కొత్త డిపాజిట్లు, రెన్యూవళ్లకు ఈ పెంచిన రేట్లు వర్తించనున్నాయి.

ద్రవ్యోల్బణ కట్టడిలో భాగంలో ఆర్‌బీఐ (RBI) ఇటీవల రెపోరేటు (Repo Rate)ను 40 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.40 శాతంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగానే తాజా డిపాజిట్‌ రేట్లను పెంచినట్లు ఎస్‌బీఐ (SBI) ఓ ప్రకటనలో పేర్కొంది. ఆర్‌బీఐ నిర్ణయం తర్వాత బంధన్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కూడా డిపాజిట్‌ రేట్లను పెంచాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ సైతం రూ.5 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై వడ్డీరేట్లను 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది. 

రూ.2 కోట్లు.. ఆపైన చేసే డిపాజిట్లపై ఎస్‌బీఐ కొత్త వడ్డీరేట్లు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని