భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Published : 25 Jan 2021 09:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.29 సమయంలో సెన్సెక్స్‌ 289 పాయింట్ల లాభంతో 49,167 వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల లాభంతో 14,446 వద్ద కొనసాగుతున్నాయి. జేకేటైర్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫినాన్స్‌, ప్రివి స్పెషాలటీ, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎన్‌సీసీ లాభాల్లో ఉండగా.. పాలీక్యాబ్‌ ఇండ్‌, ఇండో కౌంట్‌, బయోకాన్‌, సీఈఎస్‌ఈ, వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌ నష్టాల్లో ఉన్నాయి. ఇక ప్రధాన రంగాలకు చెందిన సూచీలు మొత్తం సానుకూలంగా ట్రేడవుతుండటం విశేషం. 

నేటి ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ కూడా 3శాతం పతనమైంది. డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల ప్రభావంతోనే షేర్లు పతనమైనట్లు భావిస్తున్నారు.  అల్ట్రాటెక్‌ ,హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సెస్ ‌బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ బ్లూచిప్‌ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. నేడు మొత్తం 41 సంస్థలు ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో లార్సన్‌ అండ్‌ టుబ్రో, ఆర్తిడ్రగ్స్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్‌ వంటి సంస్థలు ఉన్నాయి.

ఇవీ చదవండి

మొబైల్‌ ఫోన్లపై దిగుమతి సుంకాల బాదుడు

స్థూల నిరర్థక ఆస్తులు 20 శాతానికి చేరొచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని