Stock Market Update: ఫ్లాట్‌గా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి....

Updated : 04 May 2022 09:41 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు  మంగళవారం తీవ్ర ఒడుదొడుకుల తర్వాత చివరకు లాభాల్లో ముగిశాయి. ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అక్కడి మార్కెట్లను ప్రభావితం చేసింది. ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర ఒక శాతం మేర ఎగబాకింది. అమెరికా నిల్వలు తగ్గడంతో సరఫరాపై ఆందోళనల మధ్య ధరలు పెరిగాయి. నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా చెప్పుకొంటున్న ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కానుంది. 

Also Read: నేడే ఎల్‌ఐసీ ఐపీఓ.. సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చా?

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 49 పాయింట్ల స్వల్ప లాభంతో 57,025.41 వద్ద, నిఫ్టీ (Nifty) 5 పాయింట్లు లాభపడి 17,074 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.40 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌, విప్రో, ఎస్‌బీఐ, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌, ఏబీబీ ఇండియా, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, కార్‌ట్రేడ్‌ టెక్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, హావెల్స్‌ ఇండియా, బాంబే డైయింగ్‌ అండ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ, దీపక్‌ నైట్రైట్‌, లక్ష్మీ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌, మహీంద్రా ఈపీసీ ఇరిగేషన్‌

ఈరోజు గమనించాల్సిన స్టాక్‌లు..

* టాటా స్టీల్‌: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టాటా స్టీల్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.9,835.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 37 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.50,300.55 కోట్ల నుంచి 38 శాతం అధికమైన రూ.69,615.70 కోట్లకు పెరిగింది.

* అదానీ విల్మర్‌: కోహినూర్‌ బ్రాండ్‌ను కొనుగోలు చేసినట్లు మంగళవారం అదానీ విల్మర్ ప్రకటించింది. మెక్‌కార్మిక్‌ స్విట్జర్లాండ్‌ జీఎంబీహెచ్‌కు చెందిన ఈ బ్రాండ్‌ కొనుగోలు ద్వారా కోహినూర్‌ పేరిట విక్రయిస్తున్న బాస్మతీ బియ్యం, రెడీ టు కుక్‌, రెడీ టు ఈట్‌ కూరలు, మీల్స్‌ పోర్ట్‌ఫోలియోపై అదానీ విల్మర్‌కు విక్రయ హక్కులు దక్కనున్నాయి.

* హెచ్‌డీఎఫ్‌సీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ రూ.3,700 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ ఆర్జించిన నికర లాభం రూ.3,180 కోట్లతో పోలిస్తే ఇది 16 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.11,707.53 కోట్ల నుంచి రూ.12,308.46 కోట్లకు చేరింది.

* ఐడీబీఐ బ్యాంక్‌: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంక్‌ రూ.691 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.512 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 35 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.6,894.86 కోట్ల నుంచి రూ.5,444.08 కోట్లకు తగ్గింది. స్థూల నిరర్థక ఆస్తులు 22.37 శాతం నుంచి 19.14 శాతానికి చేరాయి.

* స్పైస్‌జెట్‌: ఇటీవల ముంబయి-దుర్గాపూర్ విమానంలో కుదుపులు తీవ్ర ఆందోళన కలిగించిన నేపథ్యంలో దీనిపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేపట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని