ఈ బ్యాటరీ జీవితకాలం 16 ఏళ్లు..!

అందుబాటులోకి వస్తే విద్యుత్తు వాహన రంగానికి వరమే

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం మన కార్లలో వాడే బ్యాటరీల జీవితకాలం 4-6 సంవత్సరాలు. ఆపై వాటి సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంది. అదే విద్యుత్తు వాహనాల బ్యాటరీ విషయానికి వస్తే గరిష్ఠంగా 8-10 ఏళ్లు పనిచేస్తుంది. ఆపై కొత్తది కొనాల్సిందే. ఇది వినియోగదారుడికి ఓ భారమనే చెప్పాలి. దీనికి చైనాకు చెందిన ఓ దిగ్గజ కంపెనీ పరిష్కారం కనుగొంది. ఏకంగా 16 ఏళ్లపాటు వినియోగించగలిగే బ్యాటరీని ఆవిష్కరించింది. అంటే పదిలక్షల కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఇవి మార్కెట్లోకి వస్తే గనక విద్యుత్తు వాహనాల చరిత్రలో ఓ మైలురాయిగా నిలవనుంది. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కే ప్రయత్నాల్లో ఉన్న వాహనరంగానికి ఇది ఓ వరంగా మారుతుందనడంలో సందేహం లేదు. 

20 లక్షల కి.మీ ప్రయాణించే సామర్థ్యం లేదా 16 ఏళ్ల సుదీర్ఘకాలం మనగలిగే బ్యాటరీలను తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ‘కాంటెంపరరీ ఆంపరెక్స్‌ టెక్నాలజీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’(సీఏటీఎల్‌) ఛైర్మన్‌ ఝెంగ్‌ యుకున్‌ తెలిపారు. ప్రస్తుతం విద్యుత్తు కార్లలో వినియోగిస్తున్న బ్యాటరీలు 1,50,000 మైళ్లు వరకు లేదా 8 సంవత్సరాల పాటు పనిచేస్తున్నాయి. బ్యాటరీల జీవితకాలాల్ని పెంచడంపై పరిశ్రమ వర్గాలు కొంతకాలంగా దృష్టి సారించాయి. తద్వారా వాహనాల నిర్వహణ భారం తగ్గి వినియోగదారుడు విద్యుత్తు వాహనాల వైపు మొగ్గుచూపుతారని భావిస్తున్నారు. కరోనా సంక్షోభంతో గ్యాస్‌ వాహనాల వైపు మళ్లుతున్న కస్టమర్లను ఆకట్టుకోవడానికి కూడా ఇది దోహదం చేస్తుందని ఆశిస్తున్నారు.

ఎవరైనా ఆర్డర్‌ చేస్తే వెంటనే ఈ తరహా బ్యాటరీలను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఝెంగ్‌ తెలిపారు. అయితే, ప్రస్తుత బ్యాటరీలతో పోలిస్తే వీటి తయారీకి 10 శాతం ఎక్కువ ఖర్చవుతుందని వెల్లడించారు. భవిష్యత్తులో విద్యుత్తు‌ వాహనాలకు భారీ డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో బ్యాటరీల పరిశోధనలపై సీఏటీఎల్‌ భారీగా ఖర్చు చేస్తోంది. 2021లో వాహన రంగం తిరిగి పుంజుకుంటుందని ఝెంగ్‌ అంచనా వేశారు. ప్రస్తుతం టెస్లా, ఫోక్స్‌వ్యాగన్‌ ఏజీ వంటి ప్రముఖ కంపెనీలకు సీఏటీఎల్‌ బ్యాటరీలను అందిస్తోంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని