Vi: వొడాఫోన్‌ ఐడియాలోనూ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ప్రియం!

గత కొంత కాలంగా మొబైల్‌ నెట్‌వర్క్‌ ప్రిపెయిడ్‌ రీఛార్జ్‌ ప్యాకేజీల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలు రీఛార్జ్‌ ధరలను పెంచడంతోపాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన పలు ప్యాకేజీలను నిలిపివేశాయి. తాజాగా వొడాఫోన్‌ ఐడియా కూడా అదే బాట పట్టింది. రూ. 501, రూ. 601, రూ. 701 ప్యాకేజీలను

Updated : 29 Dec 2021 19:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొంత కాలంగా మొబైల్‌ నెట్‌వర్క్‌ ప్రిపెయిడ్‌ రీఛార్జ్‌ ప్యాకేజీల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలు రీఛార్జ్‌ ధరలను పెంచడంతోపాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన పలు ప్యాకేజీలను నిలిపివేశాయి. తాజాగా వొడాఫోన్‌ ఐడియా కూడా అదే బాట పట్టింది. రూ. 501, రూ. 601, రూ. 701 ప్యాకేజీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రెండు ప్యాకేజీలతో డిస్నీ + హాట్‌స్టార్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ లభించేది. ఇకపై డిస్నీ + హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలంటే రూ. 901 లేదా రూ. 3,099 ప్లాన్‌ రీఛార్జ్‌ చేసుకోవాలని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. రూ. 901 రీఛార్జ్‌తో వినియోగదారులకు 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3జీబీ హైస్పీడ్‌ డేటా.. అదనంగా 48జీబీ డేటా లభిస్తుంది. అలాగే అపరిమిత కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. ఇక రూ.3,099 రీఛార్జ్‌తో ఏడాది వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ డేటా హైస్పీడ్‌ డేటా, అపరిమిత కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. డీస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ ధరలు పెరగడంతోనే మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థలు ఈ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని