Vivo Y56: వివో వై56లో కొత్త వేరియంట్‌.. ధర, ఫీచర్లలో మార్పుందా?

Vivo Y56: వివో వై56లో కొత్త వేరియంట్‌ విడుదలైంది. ఫిబ్రవరిలోనే మార్కెట్‌లోకి వచ్చిన ఈ ఫోన్‌లో ఇప్పుడు కంపెనీ కొత్త వేరియంట్‌ను తీసుకువచ్చింది. దీని ధర, మార్పులేమైనా ఉన్నాయా? వంటి వివరాలు చూద్దాం...

Published : 25 Sep 2023 14:53 IST

Vivo Y56 | ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో తమ వై56 మోడల్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసినట్లు సోమవారం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వివో వై56 విడుదలైంది. అప్పుడు కేవలం 8GB + 128GB వేరియంట్‌ను మాత్రమే తీసుకొచ్చారు. దీని ధర రూ.18,999. తాజాగా దీంట్లో 4GB + 128GB వేరియంట్‌ను కూడా విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. దీని ధర రూ.16,999.

వై56 కొత్త వేరియంట్‌ ఫీచర్లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీ తెలిపింది. 6.58 అంగుళాల ఎల్‌సీడీ తెర, మీడియాటెక్‌ డైమెన్సిటీ 700, ఆక్టాకోర్‌ 5జీ ఆధారిత చిప్‌సెట్‌ను అలాగే కొనసాగించారు. 18వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు. ర్యామ్‌ను 8జీబీ వరకు వర్చువల్‌గా విస్తరించుకోవచ్చు. స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డ్‌తో 1టీబీ వరకు పొడిగించుకునే వెసులుబాటు ఉంది.

దీంట్లో 50 ఎంపీ మెయిన్‌ సెన్సార్‌, 2 ఎంపీ డెప్త్‌ సెన్సార్‌తో కూడిన ప్రధాన కెమెరాను ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరాను పొందుపర్చారు. వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌లో ఈ ఫోన్‌ IP54 రేటింగ్‌ను పొందింది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌13ను ఇస్తున్నారు. బ్లాక్‌ ఇంజిన్‌, ఆరెంజ్‌ షిమ్మర్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోని అన్ని ప్రధాన రిటైల్‌ స్టోర్లలో వివో వై56 కొత్త వేరియంట్‌ లభించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని