Lift Collapse: పరిమితికి మించి ఎక్కడంతో కూలిన లిఫ్టు

మనం రోజు ఉపయోగించే లిఫ్టులో పరిమితికి మించి ఎక్కవద్దు అని బోర్డు కనిపిస్తుంది. అంతకంటే ఎక్కువ మంది ఎక్కితే ప్రమాదమని దానర్థం.

Published : 29 Apr 2022 02:07 IST

ఘజియాబాద్ (ఉత్తర్‌ప్రదేశ్‌): మనం రోజు ఉపయోగించే లిఫ్టులో పరిమితికి మించి ఎక్కవద్దు అని బోర్డు కనిపిస్తుంది. అంతకంటే ఎక్కువ మంది ఎక్కితే ప్రమాదమని దానర్థం. కానీ ఆ హెచ్చరికను పట్టించుకోకుండా ఓ ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థులు పరిమితికి మించి లిఫ్ట్‌లో ఎక్కారు. దీంతో లిఫ్ట్‌ కూలిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దస్నా పట్టణంలోని మేనేజ్‌మెంట్ సంస్థలో చదువుకొనే  విద్యార్థులు అక్కడి లిఫ్ట్‌ ఎక్కారు. అది ఐదో అంతస్తుకు వెళ్లేసరికి ఓవర్‌లోడ్‌ కారణంగా కేబుల్‌ వైర్‌ తెగి కూలిపోయింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఘటన జరిగినప్పుడు లిఫ్ట్‌లో 10 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో నలుగురు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడగా మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కళాశాల యాజమాన్యం స్పందిస్తూ.. ‘అధికలోడ్‌ కారణంగా ప్రమాదం జరిగింది. ఇంకేమైనా సాంకేతిక అంశాల కారణంగా ఇలా జరిగిందా అని తెలుసుకోవడానికి దానికి సంబంధించిన ఇంజనీర్లను పిలిపించాం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని