Hyderabad: కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. రెండేళ్ల చిన్నారి మృతి
ఎల్బీనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది.

నాగోలు: ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ నగర్‌లో నివసించే హబీబుద్దీన్, శశిరేఖ దంపతులకు ధనలక్ష్మి అనే రెండేళ్ల చిన్నారి ఉంది. శశిరేఖ బ్యూటీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిలో భాగంగా సేవలందించేందుకు మన్సూరాబాద్‌కు వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో భర్త హబీబుద్దీన్, కుమార్తెతో కలిసి ఎన్టీఆర్ నగర్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం 12.30గంటల సమయంలో కామినేని హాస్పిటల్ మార్గంలో ఆగి ఉన్న ఓ కారు డోర్‌ను డ్రైవర్ హఠాత్తుగా తెరవడంతో వెనక నుంచి వచ్చిన వీరి బైక్‌కు తగిలింది. దీంతో ముగ్గురూ పడిపోయారు. చిన్నారి తలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Rupert Murdoch: ‘ఫాక్స్’ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన రూపర్ట్ మర్దోక్
-
Stomach Pain: కడుపు నొప్పితో ఆస్పత్రికి.. ‘ఎక్స్-రే’ చూస్తే షాక్!
-
World Cup: ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు: హర్భజన్ సింగ్
-
TDP: వైకాపా దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొందాం? టీడీఎల్పీలో చర్చ
-
Flipkart: మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్!