Kolkata: హల్దియా రిఫైనరీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి, ఏడుగురి పరిస్థితి విషమం

పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్‌ జిల్లాలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)కు చెందిన హల్దియా రిఫైనరీలో అగ్నిప్రమాదం..........

Published : 22 Dec 2021 01:16 IST

హల్దియా: పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్‌ జిల్లాలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)కు చెందిన హల్దియా రిఫైనరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, దాదాపు 44 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. రిఫైనరీ యూనిట్‌లో షట్‌డౌన్‌కు సంబంధించిన పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని ఐఓసీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. మంటలను ఆర్పివేసి, పరిస్థితిని అదుపుచేసినట్లు పేర్కొన్నారు. గాయపడిన 44 మందిలో 37మందిని కోల్‌కతాలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పుర్బా మేదినీపూర్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఘటనపై సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారిని గ్రీన్‌ కారిడార్‌ ద్వారా ఆస్పత్రికి తరలించామని,  ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ దీదీ ట్వీట్‌ చేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని