Mass Suicide: ఒకే ఇంట్లో ఏడుగురి మృతి.. సామూహిక ఆత్మహత్యలుగా అనుమానం!

ఒకే ఇంట్లో ఏడుగురు కుటుంబ సభ్యులు విగతజీవులై కనిపించారు. గుజరాత్‌లో వెలుగుచూసిన ఈ ఘటనను పోలీసులు సామూహిక ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు.

Updated : 28 Oct 2023 18:33 IST

గాంధీనగర్‌: గుజరాత్‌ (Gujarat)లోని సూరత్‌లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతదేహాలై కనిపించారు. ఈ ఘటనను పోలీసులు సామూహిక ఆత్మహత్యలు (Mass Suicide)గా అనుమానిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండటం గమనార్హం. ఆత్మహత్యకు ముందు రాసినట్లు భావిస్తోన్న ఓ లేఖను ఘటనాస్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆర్థిక లావాదేవీలే కారణమని అందులో ప్రస్తావించినట్లు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మనీశ్‌ సోలంకీ (37) అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి సూరత్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. శనివారం వారందరూ ఇంట్లో విగతజీవులై కనిపించారు. మనీశ్‌ ఉరేసుకోగా.. మిగతా ఆరుగురు గుర్తుతెలియని విషం తాగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన చిన్నారుల్లో మనీశ్‌ కుమారుడు (6), ఇద్దరు కుమార్తె (10, 13)లు ఉన్నారు. ఘటనాస్థలంలో విషపదార్థంతో కూడిన ఓ సీసాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

దిల్లీలో దారుణం.. ఇంట్లోకి చొరబడి యువతిపై కాల్పులు

ఆర్థిక లావాదేవీలే ఈ ఘటనకు కారణమై ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈమేరకు సూసైడ్ నోట్ లభ్యమైందని, దానిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మనీశ్‌ తొలుత తన కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి, ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని సూరత్‌ మేయర్‌ నిరంజన్‌ అనుమానం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని